Advertisement
Google Ads BL

‘చూసి చూడంగానే’ అందరికి నచ్చుతుంది: నిర్మాత


‘పెళ్ళిచూపులు’, ‘మెంట‌ల్ మ‌దిలో’ వంటి చిత్రాల‌ను నిర్మించి స‌క్సెస్‌ఫుల్ నిర్మాత‌గా జాతీయ అవార్డ్‌, ఫిలింఫేర్ అవార్డుల‌ను సొంతం చేసుకున్నారు నిర్మాత రాజ్ కందుకూరి. ఆయ‌న త‌న‌యుడు శివ కందుకూరి హీరోగా న‌టిస్తోన్న తొలి చిత్రానికి ‘చూసీ చూడంగానే’. ఈ చిత్రం ద్వారా శేష సింధు రావు ద‌ర్శకురాలిగా ప‌రిచ‌యం కానుంది. జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం అయ్యారు.

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ....

మీడియా మిత్రులకు నమస్కారం. జనవరి 31న సురేష్ ప్రొడక్షన్ ద్వారా చూసి చూడంగానే విడుదల కానుంది. నేను యంగ్ ట్యాలెంట్ తో సినిమాలు చెయ్యడానికి ఇష్టపడతాను. అలా ఒక యంగ్ టీమ్ అందరూ కలిసి చేసిన సినిమా చూసి చూడంగానే. ఈ చిత్రానికి మా అబ్బాయి శివ కందుకూరి అయితే బాగుంటుందని డైరెక్టర్ శేష నాకు చెప్పడంతో శివను ఈ సినిమాతో పరిచయం చేశాను. ఈ మూవీ చాలా సహజంగా ఉంటుంది. మధురా ఆడియో ద్వారా ఈ చిత్ర పాటలను విడుదల చేస్తున్నాము. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం మరింత హైలెట్ కానుంది. నన్ను ఎప్పుడూ సపోర్టు చేసే మీడియా ఈ మూవీకి మరింత సపోర్ట్ చెయ్యాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

శివ కందుకూరి మాట్లాడుతూ....

సినిమా చెయ్యాలని డిసైడ్ అయినప్పటి నుండి అందరూ నన్ను సపోర్ట్ చేస్తున్నారు. శేష సింధు రావు ఈ సినిమా స్క్రిప్ట్ నాకు చెప్పినప్పుడే బాగా నచ్చింది. నాకోసం ఒక మంచి స్క్రిప్ట్ రాసినందుకు థాంక్స్. యంగ్ టీమ్ అందరూ కలిసి చేసిన సినిమా ఇది. మా సినిమాకు మీ అందరి సపోర్ట్ కావాలి. ఈ మూవీకి పనిచేసిన అందరూ టెక్నీషియన్స్ కు స్పెషల్ థాంక్స్. నాన్న రాజ్ కందుకూరి గారు నన్ను నమ్మి నన్ను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, థాంక్స్ టు హిమ్. మా సినిమాను విడుదల చేస్తున్న నిర్మాత సురేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలిపారు.

మధుర శ్రీధర్ మాట్లాడుతూ....

రాజ్ కందుకూరి గారు చిన్న సినిమాలకు ఎక్కువ ప్రోత్సహం  ఇస్తున్నారు. ఆయన నిర్మించిన ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి.  హీరోగా పరిచయం అవుతున్న శివ కందుకూరికి ఇది బెస్ట్ సబ్జెక్ట్. గోపిసుందర్ ఈ మూవీకి అందించిన పాటలు పాపులర్ అయ్యాయి. జనవరి 31న విడుదల కాబోతున్న ఈ చిత్ర యూనిట్ సభ్యులకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.

డైరెక్టర్ శేష సింధు మాట్లాడుతూ...

నేను ఈ సినిమా కోసం ఈగల్ గా ఎదురు చూస్తున్నాను. నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ చేసిన శివ కందుకూరి గారికి థాంక్స్. శివ కందుకూరికి యాక్టింగ్ కి స్కోప్ ఉన్న సబ్జెక్ట్ ఇది. హీరోయిన్ వర్ష ఈ సినిమాలో బాగా యాక్ట్ చేసింది. షూటింగ్ పూర్తి అయ్యేలోపు తను తెలుగు నేర్చుకుంది. డైలాగ్స్ రాసిన పద్మకు స్పెషల్ థాంక్స్. ఇతర టెక్నిషియన్స్, ఆర్టిస్ట్స్ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.

హీరోయిన్ వర్ష మాట్లాడుతూ...

నేను తెలుగులో చేసిన ఫస్ట్ మూవీ ఇది. నాకు షూటింగ్ సమయంలో సపోర్ట్ చేసిన అందరికి ధన్యవాదాలు. శివ కందుకూరి గారు నన్ను నమ్మి ఈ రోల్ ఇచ్చారు. శివ కందుకూరి అనుభవం కలిగిన హీరోలా నటించాడు. డైరెక్టర్ శేష సింధు మంచి స్క్రిప్ట్ తో మన ముందుకు వస్తున్నారు. జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మా సినిమాను బ్లస్ చెయ్యండని తెలిపారు.

హీరోయిన్ మాళవిక మాట్లాడుతూ...

చూసి చూడంగానే మీ అందరికి నచ్చే సినిమా అవుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజ్ కందుకూరి గారికి థాంక్స్, డైరెక్టర్ శేష సింధు గారు రాసుకున్న పాయింట్ ను అందంగా స్క్రీన్ పై చూపించారు. తెలుగులో నాకు ఈ మూవీ మంచి బ్రేక్ ఇస్తుందని నముతున్నాను. మా సినిమాను మీ అందరూ చూసి సపోర్ట్ చెయ్యాలని కోరుకుంటున్నా అన్నారు.

Choosi Chudangane Movie Press Meet Details:

Celebrities Speech at Choosi Chudangane Press Meet
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs