Advertisement
Google Ads BL

NTR, RRRల గురించి చరణ్ చెప్పిన ముచ్చట్లివే!


RRR సినిమా అప్ డేట్స్ ఏది వచ్చినా సోషల్ మీడియాలో అది క్షణాల్లో వైరల్ అవుతుంది. మరి అలాంటి కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతుంది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాలే కాదు.. పాన్ ఇండియా మూవీ RRR పై దేశవ్యాప్తంగా ఆసక్తి ఉంది. అందుకే RRR అప్ డేట్ అంటే అందరిలో పిచ్చ క్యూరియాసిటీ. అయితే RRR బడ్జెట్ 350 కోట్లుగా అనడమే కానీ.. రాజమౌళి ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. కానీ RRR బడ్జెట్ 350 కోట్ల బడ్జెట్ అని.. ఇంట్రో సీన్స్ కి ఐదు కోట్లు బడ్జెట్ అని, ఇంటర్వెల్ బ్యాంగ్ ఫైట్ కి 12 కోట్ల బడ్జెట్ అని, తాజాగా RRR క్లైమాక్స్ సీన్ కి 150 కోట్ల బడ్జెట్ అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇక అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.. అలియా భట్ తో రొమాన్స్ చెయ్యబోతున్నాడు.

Advertisement
CJ Advs

అయితే ఈ సినిమాలో అలియా రోల్ చాలా చిన్నదని, కేవలం 20 నుండి 25 నిమిషాల రోల్ మాత్రమే అలియా భట్ సీతగా కనబడుతుంది అని అన్నారు. అలాగే అలియా భట్ - రామ్ చరణ్ కాంబో సీన్స్ కూడా పూర్తయ్యాయని అన్నారు. కానీ తాజాగా రామ్ చరణ్.. అలియా భట్‌తో తన సీన్స్ షూట్ జరగలేదని చెబుతున్నాడు. అలియా భట్ నటనకు తాను అభిమానినని, ఆమెతో నటించే క్షణాల కోసం ఎదురు చూస్తున్నట్టుగా చెప్పిన రామ్ చరణ్ ఎన్టీఆర్‌తో కలిసి పనిచెయ్యడం హ్యాపీగా కాదు.. చాలా ఎనర్జిటిక్‌గా ఉందని.. ఈ సినిమాలో పనిచేయడం కన్నా ముందే తాము ఫ్రెండ్స్ అయినందున ఈ సినిమాలో కలిసి పనిచెయ్యడం తేలికైనదని, ఎన్టీఆర్ టపాసు లాంటోడని, ఎన్టీఆర్ ఎనర్జీ లెవెల్స్ పీక్స్ అని, ఎన్టీఆర్ సెట్స్‌లో ఉంటే చాలా సందడిగా ఉంటుంది అంటూ రామ్ చరణ్ RRR ముచ్చట్లను ఓ ఇంగ్లీష్ డైలీ‌తో పంచుకున్నాడు.

Ram Charan Talks about RRR Movie:

Waiting for Shoot with Alia Bhat Says Ram Charan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs