Advertisement
Google Ads BL

సరిలేరు హిట్టయినా ఆమెకి తలపోటు తప్పలేదు


ఛలో, గీత గోవిందంతో నటిగా నాలుగు మెట్లెక్కిన రష్మిక.... డియర్ కామ్రేడ్ తోనూ లిల్లిగా మరింతగా ప్రూవ్ చేసుకుంది. ఆ దెబ్బకి మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాలో అమ్మడుకు ఓ మంచి పాత్ర దక్కింది. ఇక మహేష్ తో రష్మిక అనగానే ప్రేక్షకులు ఎలా ఫీలయ్యారో కానీ... రష్మిక మాత్రం నమ్మలేక నమ్మలేక నమ్మింది. ఇక సినిమా విడుదలై మొదట్లో సక్సెస్ టాక్ తెచ్చుకుని కలెక్షన్స్ పరంగా బెస్ట్ అనిపించుకుంది. కానీ ఈ సినిమాలో రష్మిక పాత్ర తేలిపోవడమే కాదు... రష్మిక కూడా ప్రేక్షకులకు ఆనలేదు. అసలామె పాత్ర డిజైన్ చెయ్యడమే జనాలకు ఎక్కలేదు. దానితో సరిలేరు నీకెవ్వరు సినిమాకి రష్మిక మెయిన్ మైనస్ అయ్యి కూర్చుంది.

Advertisement
CJ Advs

మరి గ్లామర్ లేకపోయినా ఛలో, గీత గోవిందం, డియర్ కామ్రేడ్ లలో రశ్మికకి మంచి పేరొచ్చినా.... సరిలేరులో ఆమె పాత్రని అనిల్ రావిపూడి డిజైన్ చేసిన తీరు నచ్చకపోవడం, మరీ సూపర్ స్టార్ ముందు చిన్న పిల్లలా ఫీల్ అవడంతో రష్మిక ఈ సినిమాలో నిజంగానే తేలిపోయింది. అందులోను సరిలేరు మైనస్ పాయింట్స్ లో రష్మిక పేరు ముందు వినబడుతుంది. ఆమాట విన్న రష్మిక బాగా అప్సెట్ అవడమే కాదు... దర్శకుడు నా పాత్ర డిజైన్ అలా చేస్తే నేను మాత్రం ఏం చెయ్యాలి అంటూ వాపోతుందట. మరి డియర్ కామ్రేడ్ సినిమా పోయినా లిల్లిగా మార్కులు కొట్టేసిన రశ్మికకి మహేష్ సరిలేరు హిట్ అన్నప్పటికీ తలపోటు తప్పలేదు. 

Rashmika Mandanna disappointed with Sarileru Neekevvaru :

Rashmika Mandanna Not Happy with Her Role in Sarileru Neekevvaru
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs