Advertisement
Google Ads BL

‘సరిలేరు..’ను సెలబ్రిటీలు పట్టించుకోవట్లేదేం!?


‘భరత్‌ అనే నేను’, ‘మహర్షి’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ తర్వాత సూపర్‌స్టార్‌ మహేశ్‌ హీరోగా నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రం జనవరి 11న వరల్డ్‌వైడ్‌గా విడుదలై దుమ్ము లేపుతోంది. ఈ సినిమా మహేశ్ కెరీర్‌లో మాస్ సినిమాగా నిలిచిందని వీరాభిమానులు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే థ్యాంక్స్ మీట్‌తో పాటు సక్సెస్ ఇంటర్వ్యూలు సైతం చేసింది చిత్రబృందం. మరోవైపు ఇప్పటికే కలెక్షన్ల వర్షం గట్టిగానే కురిసింది.. పండగ పూర్తయ్యే సరికి మరింత వసూళ్లు పెరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కాగా ఇప్పటికే పలువురు ఈ సినిమా చూసి తమ అభిప్రాయాలను వెల్లడించారు. మరోవైపు వీరాభిమానులు సైతం తమదైన శైలిలో నెట్టింట్లో రివ్యూ రాసుకొచ్చారు.

Advertisement
CJ Advs

ఎందుకు స్పందించట్లేదు!

అయితే.. సినీ సెలబ్రిటీలు మాత్రం ఈ మూవీని పెద్దగా చూడలేదు.. అంతేకాదు.. సినిమా చూసినప్పటికీ స్పందించకపోవడంతో అసలు సినిమా వాళ్లకు నచ్చిందా..? సినిమా బాగా నచ్చడంతో ఏం కామెంట్స్ చేయాలో తెలియక మిన్నకుండిపోయారా..? అనేది మాత్రం తెలియరాలేదు. మరీ ముఖ్యంగా ఇదే సినిమాకు ఒకరోజు గ్యాప్‌లో విడుదలైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమాపై మాత్రం సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు పెద్దలు సినిమా చూసి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. మరి సరిలేరుపై ఎందుకు స్పందించట్లేదన్నది మాత్రం ఇప్పటికీ అర్థం కాని ప్రశ్నగానే మిగిలిపోయింది. 

ఇదేంటి ఎన్టీఆర్..!

ఇప్పటి వరకూ ‘అల’ సినిమా చూసిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. చాలా ఆప్యాయంగా అల్లు అర్జున్‌ను బావా, స్వామీ అంటూ పలకరిస్తూ ట్వీట్ చేశాడు. అయితే మహేశ్ కూడా ఆయనకు ఆప్తుడే.. ఇద్దరూ మంచి ఫ్రెండ్సే.. అయినప్పటికీ ‘సరిలేరు’ గురించి కనీసం సింగిల్ ట్వీట్ కూడా చేయకపోవడం గమనార్హం. బన్నీని పట్టించుకొని.. మహేశ్‌ను అస్సలు పట్టించుకోవడంతో సూపర్‌స్టార్ వీరాభిమానులు జూనియర్‌పై గుర్రుమంటున్నారు.

సుక్కు మరిచారా.. అక్కర్లేదనుకున్నారా!?

మరోవైపు.. డైరెక్టర్ సుకుమార్ కూడా ‘అల..’ గురించి తన ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చాడు. ‘అల వైకుంఠపురములో ఒక అందమైన సినిమా. త్రివిక్రమ్ గారు తన సత్తాను మరోసారి చాటారు. అల్లు అర్జున్ అద్భుతంగా నటించారు. మ్యూజిక్.. చిత్రీకరణ బాగుందని మెచ్చుకున్నారు. అల టీమ్ అందరికీ కంగ్రాట్స్’ అని చెబుతూ.. బన్నీతో హగ్ చేసుకుని ఉన్న ఫొటోను షేర్ చేశాడు. వాస్తవానికి ‘రంగస్థలం’ తర్వాత మహేశ్‌తో సుక్కు సినిమా చేయాల్సి ఉంది.. అయితే అది కొన్ని అనివార్య కారణాల వల్ల పట్టాలెక్కలేదు. దీంతో సరిలేరును ఆయన పట్టించుకోలేదని.. పైగా అల్లు అర్జున్‌తో తన నెక్స్ట్ సినిమా కావడంతో బన్నీని ఆకాశానికెత్తేశారని దీన్ని బట్టి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

ఫోన్ కాల్ కూడా రాలేదేట!

మొత్తానికి చూస్తే.. ఇప్పటి వరకూ సరిలేరుపై సినీ సెలబ్రిటీలు దాదాపు స్పందించలేదని తెలుస్తోంది. అంతేకాదు.. మెగాస్టార్ చిరంజీవి నుంచి కూడా ఫోన్ కాల్ రాలేదని.. సినిమా నచ్చలేదు గనుకే ఫోన్ రాలేదని కూడా టాక్ నడుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే సెలబ్రిటీల నుంచి మహేశ్‌కు ఆదరణ కరువైందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఇందులో నిజానిజాలెంతో సరిలేరు చిత్రబృందానికి ముఖ్యంగా.. మహేశ్‌కు తెలియాల్సి ఉంది.

Why Celebrities Don’t Talk About Sarileru Neekevvaru!!:

Why Celebrities Don’t Talk About Sarileru Neekevvaru!!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs