Advertisement
Google Ads BL

ఏం చేశాడని.. బండ్లకు అంత పారితోషికం!?


‘భరత్‌ అనే నేను’, ‘మహర్షి’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ తర్వాత సూపర్‌స్టార్‌ మహేశ్‌ హీరోగా నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రం జనవరి 11న వరల్డ్‌వైడ్‌గా విడుదలై దుమ్ము లేపుతోంది. ఈ సినిమా మహేశ్ కెరీర్‌లో మాస్ సినిమాగా నిలిచిందని వీరాభిమానులు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే థ్యాంక్స్ మీట్‌తో పాటు సక్సెస్ ఇంటర్వ్యూలు సైతం చేసింది చిత్రబృందం. మరోవైపు ఇప్పటికే కలెక్షన్ల వర్షం గట్టిగానే కురిసింది.. పండగ పూర్తయ్యే సరికి మరింత వసూళ్లు పెరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. 

Advertisement
CJ Advs

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో కొందరి పాత్రల గురించి విమర్శలు మాత్రం వెల్లువెత్తుతున్నాయి. అసలు ఈ సినిమాలో ఒకట్రెండు పాత్రలు ఎందుకు పెట్టారో తెలియక సినిమా చూసిన ప్రేక్షకులు తలలు పట్టుకుంటున్నారట. మరీ ముఖ్యంగా బండ్ల గణేష్‌ను ఎందుకు తీసుకున్నార్రా బాబూ.. ఇంకెవ్వరు కమెడియన్స్ దొరకలేదా..? అంటూ మహేశ్ ఫ్యాన్సే ఒకింత అసంతృప్తికి లోనవుతున్నారట. ఇవన్నీ అటుంచితే.. గట్టిగా పదే పది నిమిషాలు కూడా ట్రైన్ ఎపిసోడ్‌లో కనిపిస్తాడంతే.. ఈ పదినిమిషాలకే ఒకట్రెండు కాదు.. ఏకంగా రూ. 20 లక్షలు బాదాడని టాక్ నడుస్తోంది. 

అంత రెమ్యునరేషన్ ఇచ్చినప్పటికీ పాత్ర మాత్రం పేలకపోవడంతో అనవసరంగా ఆయన్ను తీసుకున్నామేమో.. ఇంకెవర్నయినా ఈ పాత్రకు తీసుకొని ఉండుంటే బాగుండుదేమోనని దర్శకుడు ఆలోచనలో పడ్డాడట. సినిమా సక్సెస్ అయ్యింది కాబట్టి అన్నీ అలా సాగిపోతున్నాయ్ కానీ లేకుంటే పరిస్థితులు మరోలా ఉండేదేమో. అసలు ఆయన ఏమంతగా చేశాడని ఆ రేంజ్‌లో ఇచ్చుకున్నారో అర్థం కాని పరిస్థితి! అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మున్ముంథు సినిమాలో అనిల్ జాగ్రత్త పడి మంచి కమెడియన్స్‌ను తీసుకుంటే మంచిదని సిని ప్రియులు, క్రిటిక్స్ చెబుతున్నారు.

Shocking Remuneration Taken Bandla For Sarileru:

Shocking Remuneration Taken Bandla For Sarileru  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs