Advertisement
Google Ads BL

‘పోకిరి’ని మించిన సినిమా తెరకెక్కించేదెవరో!?


‘భరత్‌ అనే నేను’, ‘మహర్షి’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ తర్వాత సూపర్‌స్టార్‌ మహేశ్‌ హీరోగా నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రం జనవరి 11న వరల్డ్‌వైడ్‌గా విడుదలై దుమ్ము లేపుతోంది. ఈ సినిమా మహేశ్ కెరీర్‌లో మాస్ సినిమాగా నిలిచిందని వీరాభిమానులు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే థ్యాంక్స్ మీట్‌తో పాటు సక్సెస్ ఇంటర్వ్యూలు సైతం చేసింది చిత్రబృందం. మరోవైపు ఇప్పటికే కలెక్షన్ల వర్షం గట్టిగానే కురిసింది.. పండగ పూర్తయ్యే సరికి మరింత వసూళ్లు పెరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. సోషల్‌ మీడియా వేదికగా ఫ్యాన్స్‌ అడిగిన ప్రశ్నలను డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి మహేశ్‌కు చదివి వినిపించగా.. సూపర్‌స్టార్ చాలా లాజిక్‌గా.. కూల్‌ కూల్‌గా సమాధానాలిచ్చారు.

Advertisement
CJ Advs

అభిమాని : ‘పోకిరి’ మహేశ్‌ అటిట్యూడ్‌ అండ్‌ ఇంటెన్స్‌ కావాలి..!

మహేశ్ : కచ్చితంగా భవిష్యత్‌లో ఇంతకంటే గొప్ప చిత్రాలను చేద్దాం. ‘పోకిరి’ని మించిన సినిమా చేద్దాం.. 

అభిమాని: మైండ్‌ బ్లాక్‌ సాంగ్‌లో శేఖర్‌ మాస్టర్‌ డ్యాన్స్‌ కంపోజ్‌ బాగా చేశారు!?.. ఇక నుంచి ప్రతీ సినిమాకు అతడినే కొరియోగ్రఫర్‌గా పెట్టుకోండి!

మహేశ్: తప్పకుండా నా చిత్రంలో కనీసం రెండు పాటలకు శేఖర్‌ మాస్టర్‌తో కలిసి పనిచేస్తాను.

మొత్తానికి చూస్తే.. పోకిరిని మించిన సినిమాను మహేశ్ మాత్రం రెడీగా ఉన్నాడు. మరి ఆ రేంజ్‌ కథను సిద్ధం చేసేదెవరో..? అసలు ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుంది..? అంతకుమించిన అంటే పోకిరిని తెరకెక్కించిన పూరీ జగన్నాథే రంగంలోకి దిగాల్సిందేనేమో. వాస్తవానికి ‘జనగణమన’ కథ ఇప్పటికే సూపర్‌స్టార్ సిద్ధంగా ఉంది. మరి ఇదేమైనా ట్రాక్‌లో వస్తుందో.. త్వరలో వంశీ పైడిపల్లి తెరకెక్కించనున్న మూవీ పోకిరిని దాటుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

Who Directs Pokiri Range Movie With Mahesh Babu!?:

Who Directs Pokiri Range Movie With Mahesh Babu!?  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs