Advertisement
Google Ads BL

బన్నీ నెక్స్ట్ సినిమాలో పూజా హెగ్దే..!?


టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్దే నటీనటులుగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా ఈ నెల 12వ తేదీన భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించిన సంగతి తెలిసిందే. సినిమా సూపర్ డూపర్ హిట్టవ్వడంతో పాటు భారీగానే వసూళ్లను రాబడుతూ సంక్రాంతి స్టార్‌గా బన్నీ దూసుకెళ్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పటికే టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఉన్న పూజా హెగ్దే.. ఈ సినిమా సూపర్ హిట్టవ్వడంతో తన రేంజ్ మరింత పెరినట్లయ్యింది. ప్రస్తుతం అటు బన్నీ.. ఇటు పూజా ఇద్దరూ సినిమా సక్సెస్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇరువురూ సక్సెస్ మీట్, థ్యాంక్స్ మీట్లలో హడావుడి చేస్తున్నారు.

Advertisement
CJ Advs

తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీ గురించి పూజా.. ఈ భామ గురించి అల్లు అర్జున్ ఇద్దరూ ఒకరిపై ఒకరు ప్రశంసల వర్షం కురిపించుకున్నారు. అంతేకాదు.. బన్నీ అభిమానిగా మారిపోయానని పూజా చెప్పగా.. మరో సినిమా చేయాలనుందని స్టైలిష్‌స్టార్ చెప్పడంతో మెగా ఫ్యాన్స్‌ ఆనందంలో మునిగితేలుతున్నారు. ఈ ఇద్దరి కాంబోలో కచ్చితంగా మరో సినిమా ఉంటుందని చెప్పకనే చెబుతున్నారన్న మాట.

పూజా ఏమంది..!?

‘బన్నీ అంకితభావం చూసిన తరువాత ఆయనకి నేను అభిమానిగా మారిపోయా. ఆయన కష్టపడే తత్వం నాకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు నన్ను మరింత చేరువ చేసినందుకు చాలా ఆనందంగా వుంది’ అని ఈ బ్యూటీ చెప్పింది.

బన్నీ ఏమన్నాడు!?

‘పూజ హెగ్దేతో మరోసారి కలిసి నటించాలని వుంది’ అని అల్లు అర్జున్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. అంటే.. సుక్కు-బన్నీ కాంబోలో వస్తున్న సినిమాలో తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని తెలుస్తోంది. మరి ఈ వ్యవహారం ఎంతవరకూ వెళ్తుందో ఏంటో..!

Bunny-Pooja Hegde Acts Next Movie!:

Bunny-Pooja Hegde Acts Next Movie!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs