Advertisement
Google Ads BL

అంత రెమ్యూనరేషన్ ఇచ్చి ఎందుకు పెట్టుకున్నారో?


ఈ సంక్రాంతి పండక్కి కోడిపందేలకు ఎంత క్రేజ్ ఉంటుందో... పండగ సినిమాలకు అంతే క్రేజ్ ఉంటుంది. అందుకే పండగలకి పొలోమంటూ సినిమాలు దిగిపోతాయి. అందులోను భారీ బడ్జెట్ సినిమాలు ఓ లెక్కలో ఉంటాయి. తాజాగా మహేష్ బాబు, అల్లు అర్జున్ ఈ పండగ సీజన్ లో కోడిపందేల పొగరుతో పోటీపడ్డారు. మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాకి హిట్ టాక్ వచ్చి మాస్ ఎంటర్టైనర్ గా నిలవగా, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చి క్లాసీ హిట్ గా నిలిచింది. అయితే ఈ రెండు సినిమాల్లో మహేష్, అల్లు అర్జున్ లు ఇరగదీయగా.. దర్శకులు అనిల్ రావిపూడి కామెడి కన్నా మాస్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడన్నారు. ఇక త్రివిక్రమ్ ఎప్పటిలాగా పంచ్ డైలాగ్స్ కి పెద్దపీటవేసి కుటుంబ ప్రేక్షకులను టార్గెట్ చేసాడు.

Advertisement
CJ Advs

అయితే ఈ రెండు సినిమాల్లో కొన్ని కామన్ ప్లస్ పాయింట్స్, కొన్ని కామన్ నెగటివ్ పాయింట్స్ ఉన్నాయి. అందులో అన్నిటి కన్నా ముఖ్యమైనవి.. రెండు సినిమాల్లోనూ తారాగణం, పేరున్న నటులు నటించడం సరిలేరు నీకెవ్వరు సినిమాలో విజయశాంతి, ప్రకాష్ రాజ్, బండ్ల గణేష్, సంగీత, హరితేజ,  జబర్దస్త్ బ్యాచ్ ఇలా తెర నిండుగా నటులు కనిపించగా అందులో విజయశాంతి, ప్రకాష్ రాజ్ లే పవర్ ఫుల్ గా నటించగా... బండ్ల లాంటోళ్ళు కేవలం కామెడికి పరిమితమయ్యారు కానీ.. అనిల్ వాళ్ళని పూర్తిగా సినిమాలో భాగం చెయ్యలేకపోయాడు. మళ్ళీ బండ్ల లాంటోళ్ళకి భారీ పారితోషకాలిచ్చి మరీ తెచ్చాడు. ఇక అల వైకుంఠంలో కూడా తెర నిండా నిండుగా పేరున్న నటులే. టబు, జయరాం, సచిన్ ఖేద్కర్, మురళి శర్మ, రావు రమేష్, సునీల్ ఇలా చాలామంది ఉన్నారు. కానీ త్రివిక్రమ్ బన్నీ మీద, పూజా అందాల మీద పెట్టిన శ్రద్ద భారీ పారితోషకాలిచ్చి తెచ్చిన టబు, జయరాం లాంటోళ్ళ మీద పెట్టకుండా వారికీ బోలెడంత డబ్బు తగలేసినట్లు అయ్యింది. అంటే బడ్జెట్ లో నటుల పారితోషకాలకే చాలా పోతుందనేది తెలిసిందే. 

Sankranthi Movies: Money waste for Remunerations:

Top Actors in Sankranthi Released Movies
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs