Advertisement
Google Ads BL

రష్మిక, పూజాలలో ఎవరిది పై చేయి?


ఈ మధ్యన టాలీవుడ్ లో హీరోయిన్స్ లిస్ట్ లో రష్మిక మందన్న పేరు, పూజా హెగ్డే పేరు మాత్రమే వినబడుతుంది. కాజల్, తమన్నా, అనుష్క, నయనతార అందరూ సీనియర్స్ లిస్ట్ లోకి వెళ్లిపోవడంతో రష్మిక, పూజా హెగ్డేలే బెస్ట్ ఆప్షన్ గా కనబడుతున్నారు. యంగ్ అండ్ స్టార్ హీరోల ఆప్షన్ రష్మిక, పూజానే. అంతగా వారు హైలెట్ అవడమే కాదు ఈ పండక్కి ఈ ఇద్దరు హీరోయిన్స్ పోటీపడ్డారు. స్టార్ హీరోలతో కలిసి నటించిన రష్మిక సరిలేరు నీకెవ్వరు, పూజా హెగ్డే అల వైకుంఠపురములో సినిమాలు నువ్వా నేనా అంటూ సంక్రాంతి బరిలో దిగాయి. మరి మహేష్ పక్కన రష్మిక, అల్లు అర్జున్ పక్కన పూజా హేగ్డేలకు ఎన్ని మార్కులు  పడ్డాయో.. ఫైనల్ గా ఈ సంక్రాంతికి ఎవరు పైచెయ్యి సాధించారో చూద్దాం.

Advertisement
CJ Advs

సరిలేరు నీకెవ్వరు సినిమాలో రష్మిక నార్మల్ లుక్స్ తో సంస్కృతి పాత్రలో మహేష్ ని ఎలాగైనా పడేసి పెళ్లి చేసుకోవాలనే పాత్రలో కనబడింది. అల్లరిగా కామెడీగా అర్ధమయ్యిందా... అనే రైమింగ్ వర్డ్ తో రష్మిక పాత్ర సరిలేరులో ఓకే ఓకే. అయితే రష్మిక అల్లరి అక్కడక్కడా అతిగా అనిపించడం, మహేష్ మీద మాట్లాడితే పడిపోవడానికి ట్రై చెయ్యడం వంటివి ప్రేక్షకులకు రుచించవు. ఇక రష్మిక పాత్ర సినిమాలో ఫస్ట్ హాఫ్ వరకే పరిమితమైంది. అయితే స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్స్ పాత్ర ఇంతకన్నా ఎక్కువగా ఆశించడం కరెక్ట్ కాదేమో అనే ఫీలింగ్ తెప్పిస్తుంది.

ఇక మరో హీరోయిన్ పూజా హెగ్డే కూడా అల వైకుంఠపురములో గ్లామర్ లుక్స్ తో అదరగొట్టేసింది. అల్లు అర్జున్ తో పాటలో అందాలు ఆరబోస్తూ గ్లామర్ డాల్ గా డాన్స్ లు కుమ్మేసింది. కానీ పూజా హెగ్డే పాత్రకి సినిమాలో అంతగా ప్రాముఖ్యత లేదు. కేవలం గ్లామర్ డాల్ గా మాత్రం పనికొచ్చింది. నాకన్నా ఎక్కువగా గ్లామర్ ఎవరూ చూపించలేరు అన్నట్టుగా పూజా కనిపించింది కానీ.. టీజర్ లో, ట్రైలర్ లో చూపించినట్టుగా పూజా పాత్ర అల వైకుంఠపురములో హైలెట్ అవ్వలేదు. మరి ఆ రకంగా రష్మిక, పూజా పాత్రలు భారీ బడ్జెట్ సినిమాల్లో భారీగా ఊహించుకుంటే చివరికి ఇలా అయ్యింది. మరి ఫైనల్ గా రష్మిక బెస్ట్ పెరఫార్మరా? లేదంటే పూజా బెస్ట్ పెరఫార్మరా? అనేది మీరే చెప్పండి.

Who is the Sankranthi Winner?:

No Importance to Pooja Hegde and Rashmika Mandanna in Their Sankranthi Movies
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs