Advertisement
Google Ads BL

బంటూని త్రివిక్రమ్ ఇష్టమొచ్చినట్లు వాడేశాడుగా!


త్రివిక్రమ్ అజ్ఞాతవాసి డిజాస్టర్, అరవింద సమేత యావరేజ్ తర్వాత అల్లు అర్జున్‌తో ‘అల వైకుంఠపురములో’ సినిమాని కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కించాడు. ఇక అల్లు అర్జున్ కూడా నా పేరు సూర్య డిజాస్టర్ తర్వాత దాదాపుగా ఏడాది గ్యాప్ తో ఓ చక్కని ఫామిలీ ఎంటర్టైనర్ చేసాడు. అయితే త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబోలో జులాయి, సన్ అఫ్  సత్యమూర్తి సినిమాలు వచ్చాయి. హిట్ అయ్యాయి. జులాయిలో అధిక తేలితేటలతో డబ్బు ఎలా సంపాదించాలి, దొంగల్ని ఎలా పట్టుకోవాలనే కసితో ఉన్న కుర్రాడు కామెడీ చేస్తే ఎలా ఉంటుందో చూపించిన త్రివిక్రమ్, సన్ అఫ్ సత్యమూర్తితో ఓ తండ్రి పేరు కోసం కొడుకు పడే తపనని.. కామెడీతో కూడిన ఎమోషన్‌తో మలిచాడు. మరి జులాయి హిట్ కొడితే.. సన్ ఆఫ్ సత్యమూర్తి కమర్షియల్ హిట్ కొట్టింది.

Advertisement
CJ Advs

ముచ్చటగా మూడో సినిమా అల వైకుంఠపురములో సూపర్ హిట్ టాక్‌తో సంక్రాతి పండగకీ వచ్చిన ఫ్యామిలీ ఎంటెర్టైనెర్‌గా నిలిచింది. అల వైకుంఠపురములో అల్లు అర్జున్ లుక్‌లోను.. నడకలోను.. పాటల్లోనే కాదు.. ఫైట్స్‌లోనూ స్టైలిష్‌గా కనిపించాడు.. సాధారణంగా ఫైట్స్ మాస్‌గా వుంటాయి. కానీ ఇందులోని ప్రతి యాక్షన్‌ సీన్ స్టైలిష్‌కు అమ్మామొగుడిలా సాగింది. అల్లు అర్జున్‌కు వున్న స్టైలిష్‌ ఇమేజ్‌ను త్రివిక్రమ్‌ ఇష్టమొచ్చినట్టు ఎడాపెడా వాడేసుకున్నాడు. పాత కథలనే త్రివిక్రమ్‌ మళ్లీ తీస్తాడన్న విమర్శను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 

ఎందుకంటే త్రివిక్రమ్‌ మాటలు.. మేకింగ్‌తో మ్యాజిక్‌ చేస్తాడు. అల్లు అర్జున్ బంటు పాత్రను పెర్‌ఫార్మెన్స్‌తో నిలబెట్టాడు. అల్లు అర్జున్ అందరికంటే ముందు మురళి శర్మను చెప్పాలి. ఆయన కెరీర్‌లో బెస్ట్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇదే. ఇక  గ్లామర్ రోల్‌ చేయాలంటే.. తనే అన్నట్టుగా పూజా హెగ్డే ఇంప్రెస్‌ చేస్తుంది. మరి జులాయి.. సన్నాఫ్‌ సత్యమూర్తి తర్వాత బన్నీ, త్రివిక్రమ్‌ హ్యాట్రిక్‌ కలను అల వైకుంఠపురములో ఇలా తీర్చేసింది.

Blockbuster Result to Bunny Ala Vaikunthapurramloo:

<span>Ala Vaikunthapurramloo Creates Records at Box Office</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs