టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ‘రౌడీ’ బ్రాండ్ పేరుతో బట్టల బిజినెస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. తన రౌడీ బట్టలను సంక్రాంతికి కానుకగా ‘అలవైకుంఠపురంలో..’ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు పంపాడు. ఆ బట్టలు చూసిన బన్నీ మురిసిపోయాడు. వాస్తవానికి జూనియర్, సీనియర్.. టాప్ ప్రొడ్యూసర్స్ అందరితో విజయ్‌కు మంచి సన్నిహిత సంబంధాలున్నాయ్. తనకు బ్రాండ్ బట్టలను తనకు తానుగా ప్రమోషన్ చేసుకుంటూ.. మరోవైపు ఆ బ్రాండ్‌ను హీరోలకు పంపిస్తూ ఆశ్చర్యపరుస్తుంటాడు విజయ్. అలా.. ఇటీవల బన్నీకి బట్టలు పంపాడు.. అనంతరం ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న రౌడీ, బన్నీ ఫ్యాన్స్ లైక్స్ చేస్తూ.. కామెంట్ల వర్షం కురిపించారు.
కాగా.. ఈ బట్టలు చూసిన బన్నీ కూడా స్పందించాడు. ‘థాంక్యూ వెరీ మచ్ బ్రదర్ విజయ్. నీ బహుమతులు చాలా బాగున్నాయ్. అల వైకుంఠపురములో సక్సెస్ మీట్‌లో ఇవే ధరిస్తాను’ అని రౌడీ ట్వీట్‌కు బన్నీ రిప్లయ్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. ‘అల’ సినిమా మంచి హిట్ టాక్ సంపాదించుకుంది. బొమ్మ అదిరిపోయింది. అయితే.. రేపో మాపో సినిమా సక్సెస్ మీట్ జరగనుంది. మరి బన్నీ ఆ బట్టలు ధరిస్తాడో లేదో మరి. కాగా.. విజయ్ దేవరకొండకు నిర్మాత అల్లు అరవింద్ మంచి సపోర్ట్ ఇస్తూ ఎంకేరేజ్ చేస్తుంటారన్న విషయం తెలిసిందే. మరోవైపు.. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రౌడీ బట్టల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతోంది. ఇలా సినిమాలు.. అలా బట్టల బిజినెస్‌తో రౌడీ రాజ్యమేలుతున్నాడు.!