అవును అనిల్ రావిపూడికి సెకండ్ హాఫ్ గండం ఉన్నట్లుగా కనబడుతుంది ఆయన గత రెండు సినిమాలు చూస్తుంటే. దర్శకుడు అనిల్ రావిపూడి స్వతహాగా కామెడీ ఎంటర్టైనర్స్ ని తెరకెక్కించే దర్శకుడు. కానీ హీరోని బట్టి అనిల్ రావిపూడి తన స్టయిల్ మారుస్తాడు. గత ఏడాది వెంకటేష్ - వరుణ్ తేజ్ లతో ఎఫ్ 2 అనే మల్టీస్టారర్ మూవీని తెరకెక్కించాడు. ఆ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా వెంకటేష్ కామెడీ టైమింగ్ అడుగడుగునా ఆకట్టుకుంది. వెంకటేష్, అన్నపూర్ణ, ప్రభ, మెహ్రీన్, తమన్నా, వరుణ్ తేజ్ లతో చేసే కామెడీ కడుపుబ్బా నవ్వించింది. అయితే ఎఫ్ 2 సెకండ్ హాఫ్ లో కామెడీ అసలు ఆకట్టుకోదు. ఎందుకంటే రాజేంద్రప్రసాద్ వెగటు కామెడీ, వెంకీ - వరుణ్ లు కూడా బోర్డర్ దాటేసిన వెధవ పంచ్ లతో ఇరిటేట్ తెప్పిస్తారు. అసలు ఎఫ్ 2 సెకండ్ మైనస్ అయినా ఆ సినిమా అలా అలా బ్లాక్ బస్టర్ అయ్యింది.
ఇక తాజాగా అనిల్ రావిపూడి కొత్త చిత్రం సరిలేరు నీకెవ్వరు కూడా ఫస్ట్ హాఫ్ కామెడీతో అదరగొట్టేయ్యగా.. సెకండ్ హాఫ్ యాక్షన్ తో నిడివి పెంచి బోర్ కొట్టించాడు. ఫస్ట్ హాఫ్ ట్రైన్ కామెడీతో నవ్వించిన అనిల్ రావిపూడి సెకండ్ హాఫ్ లో సీరియస్ గా యాక్షన్ మోడ్ లోకి వెళ్లడమే కాదు.... సెకండ్ హాఫ్ లో పెట్టిన కామెడీ ఆకట్టుకునేలాలేదు. ఇక సెకండ్ హాఫ్ నిడివి ఇబ్బంది పెట్టే అంశం. అలాగే కొన్ని సాగదీత సన్నివేశాల వలన సెకండ్ హాఫ్ ని ప్రేక్షకుడు బోర్ ఫీల్ అవడంతో.. అనిల్ రావిపూడికి సెకండ్ హాఫ్ గండం అంటూ సోషల్ మీడియాలో సెటైర్స్ వేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ ని ఓ లెక్కలో నడిపించే అనిల్ రావిపూడి సెకండ్ హాఫ్ హ్యాండిల్ చెయ్యడంలో తడబడతాడని అంటున్నారు. మరి అది నిజమే అంటావా అనిల్ రావిపూడి.