Advertisement
Google Ads BL

‘రాహు’ రిలీజ్ డేట్ ప్రకటించారు


కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకున్న రాహు ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తన గాత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తున్న సిధ్ శ్రీరామ్ పాడిన ‘‘ఎన్నెన్నో వర్ణాలు వాలాయి చుట్టూ నీతోటి నే సాగగా.. పాదాలూ దూరాలు మరిచాయి ఒట్టూ మేఘాల్లో ఉన్నట్టుగా.. ఏమో ఏమో ఏమో’’ పాట ‘రాహు’కు

Advertisement
CJ Advs

ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సిధ్ శ్రీరామ్ గానం చేసిన ఈ పాట హాంటింగ్ సాంగ్ అనిపించుకుంటోంది.

ఈ సందర్భంగా దర్శకుడు సుబ్బు వేదుల మాట్లాడుతూ: ‘‘ ప్రేమకథా చిత్రంలా కనిపించినా.. ఇదో థ్రిల్లర్ మూవీ. టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో ఉండబోతుంది. ప్రేమకథలోని బలమైన ఎమోషన్స్ ని ప్రజెంట్ చేస్తూనే అనుక్షణం ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అయ్యే విధంగా కథనం సాగుతుంది. ప్రవీణ్ లక్కరాజు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రాహుకి అసెట్ గా మారింది. థ్రిలర్స్  తెలుగులో కొత్త ట్రెండ్ ని సెట్ చేస్తున్నాయి. రాహు వాటి సరసన నిలబడుతుంది అని కాన్ఫిడెంట్ గా మా టీం ఉంది. ఈ చిత్రాన్ని గ్రాండ్ గా ఫిబ్రవరి 21న విడుదల చేస్తున్నాం’’ అన్నారు. 

న్యూ ఎజ్ థ్రిలర్ గా రాబోతున్న రాహు చిత్రంలో కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నికలు నటిస్తున్నారు.

టెక్నికల్ గా అత్యున్నతంగా ఉండబోతోన్న ఈ చిత్రానికి 

డిఓపి - సురేష్ రగుతు

మ్యూజిక్ - ప్రవీణ్ లక్కరాజు

ఎడిటింగ్ - అమర్ రెడ్డి

పి ఆర్ ఓ : జీ యస్ కే మీడియా

నిర్మాతలు - ఏ.వి.ఆర్ స్వామీ, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ, సుబ్బు వేదుల.

రచన-దర్శకత్వం - సుబ్బు వేదుల.

Raahu Movie Release Date Announced:

Raahu Movie Release on Feb 21st
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs