టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిపై ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పవర్‌స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. అసలేం జరిగింది..? అశ్వనీదత్ ఎందుకింతలా ఆగ్రహం వ్యక్తం చేశారు..? అనే విషయం ఈ కథనంలో తెలుసుకుందాం.
చిరుకేం తెలుసు..!?
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తరలింపును వ్యతిరేకిస్తూ గత కొన్నిరోజులుగా ఆయా గ్రామాలకు చెందిన రైతులు, రైతు కూలీలు, టీడీపీ నేతలు.. ఆఖరికి టీడీపీ అధినేత చంద్రబాబు సైతం రంగంలోకి దిగారు. అయితే ఈ మూడు రాజధానులను మెగాస్టార్ చిరంజీవి స్వాగతించి.. సీఎం వైఎస్ జగన్‌కు మద్దతిచ్చారు. అయితే ఆయనలా మద్దతివ్వడానికి అశ్వనీదత్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇవాళ ఓ ప్రముఖ మీడియా చానెల్ ప్రతినిధితో మాట్లాడిన ఆయన.. చిరంజీవి వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగని ఆయన.. చిరంజీవికి ఏం తెలుసని మూడు రాజధానులు బాగుంటుందని చెప్పారు..? అని సూటి ప్రశ్న సంధించారు. ప్రపంచంలో బహుళ రాజధాని వ్యవస్థ ఫెయిలైన విషయం ఆయనకు తెలియదా? అని చిరుపై అశ్వనీదత్ ప్రశ్నాస్త్రాలు విసిరారు.
ఎందుకిలా..!?
ఇదిలా ఉంటే.. ఈ మూడు రాజధానులను పవన్ వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ గురించి అశ్వనీదత్ మాట్లాడుతూ.. పవన్‌కళ్యాణ్ సినిమాల్లో నటిస్తే కోట్లలో సంపాదిస్తారని.. సినిమాలు వదిలేసి రైతుల కోసం ఎందుకు పోరాడుతున్నాడో చిరుకు తెలియదా? అని జనసేనానిని ప్రస్తావిస్తూ అశ్వనీదత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు ‘అన్నయ్య’పై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ‘తమ్ముడు’పై అశ్వనీదత్ ప్రశంసల వర్షం కురిపించారు. మరి ఆయన మాటల వెనుక ఆంతర్యమేంటి..? ఎందుకంతలా ఆయన ఫైర్ అవుతున్నారన్నది అశ్వనీదత్‌కే తెలియాలి. మరోవైపు ఆయన వ్యాఖ్యలపై మెగాభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై మెగాస్టార్ ఎలా రియాక్ట్ అవుతారో అనేదానిపై తెలుగు రాష్ట్రాల ప్రజలు, మెగాభిమానులు, రాజధాని రైతులు ఎంతగానో వేచి చూస్తున్నారు.