ఎస్.ఎస్.ఆర్ట్ ప్రొడక్షన్స్, యుగ క్రియేషన్స్ బ్యానర్స్ పై రాహుల్ భాయ్ మీడియా మరియు దుర్గశ్రీ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమ పిపాసి’. పి.ఎస్.రామకృష్ణ (ఆర్ .కె ) ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి మురళీరామస్వామి (ఎమ్ఆర్ ) దర్శకత్వం వహిస్తున్నారు. జిపిఎస్, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షివర్మ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ సంక్రాంతి కానుకగా ఇటీవల దర్శకుడు మారుతి చేతుల మీదుగా లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ...‘పియస్ రామకృష్ణ నిర్మాతగా, మురళిరామ స్వామి దర్శకత్వంలో రూపొందిన ‘ప్రేమపిసాసి’ చిత్రం ట్రైలర్ చాలా ట్రెండీగా, యంగేజింగ్‌గా ఉంది. కొత్త టీమ్ చేసిన ఈ ప్రయత్నం బాగుంది. జీపీయస్ కూడా ఎంతో ఎక్స్‌పీరియన్స్‌డ్ హీరోగా నటించాడు. ట్రైలర్ ఎంత ఎంటర్‌టైనింగ్‌గా ఉందో సినిమా కూడా అంత ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందన్న నమ్మకం ఉంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’అన్నారు.
నిర్మాత పి.యస్.రామకృష్ణ మాట్లాడుతూ...‘మారుతి గారు మా సినిమా ట్రైలర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ట్రెండీగా, యంగేజింగ్‌గా ట్రైలర్ ఉందంటూ మంచి కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు జరుగుతున్నాయి. ఫిబ్రవరిలో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు.
కో-ప్రొడ్యూసర్ రాహుల్ పండిట్ మాట్లాడుతూ...‘మారుతి గారు మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడం హ్యాపీ. మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. నిజంగా ఆయనకు మా ట్రైలర్ నచ్చడంతో సినిమా సక్సెస్ అయినంత హ్యాపీగా ఉంది’ అన్నారు.
హీరో జిపియస్ మాట్లాడుతూ..‘మారుతి గారు ట్రైలర్ చూసి ఎంతో ఎక్స్‌పీరియన్స్‌డ్ హీరోలా నటించావని కాంప్లిమెంట్ ఇవ్వడంతో ఇన్ని రోజు పడ్డ కష్టానికి ప్రతి ఫలం దక్కినంత ఆనందంగా ఉంది. దీనికి కారణం మా దర్శక నిర్మాతలు’ అన్నారు.
హీరోయిన్ సోనాక్షి మాట్లాడుతూ..‘సినిమా రిలీజ్ కోసం ఎంతో ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నా’అన్నారు.
దర్శకుడు మురళిరామస్వామి మాట్లాడుతూ...‘మా సినిమా ట్రైలర్ మారుతి గారి చేతుల మీదుగా రిలీజ్ కావడం చాలా హ్యాపీ. ట్రెండీగా, యంగేజింగ్‌గా ఉందంటూ మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఎంతో కష్టపడి యూనిట్ అందరం సినిమా చేశాం. సినిమా ఇంత బాగా వచ్చిందంటే మా నిర్మాత పూర్తి సహకారం వల్లే. మా హీరో జిపియస్ ఈ సినిమా కోసం బాడీ లాంగ్వేజ్, లుక్ పరంగా ఎంతో హార్డ్ వర్క్ చేశారు. నలుగురు హీరోయిన్స్ నటించారు. ట్రెండ్‌కి అడ్వాన్స్‌డ్‌గా సినిమా తీశాం. లవ్ ప్రస్తుతం ఎంతో కమర్షియల్‌గా తయారైంది. ఒక జెన్యూన్ లవ్ వెతికేవాళ్లు, ఎలా ప్రేమించకూడదో తెలుసుకోవడానికి మా సినిమా చూడొచ్చు’ అన్నారు.
జిపిఎస్, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షి వర్మ, జ్యోతి రాజ్ పుత్, మమత శ్రీ చౌదరి, ‘ఢీ జోడి ఫేమ్’ అంకిత, బిగ్ బాస్ ఫేమ్ బందగీ కర్ల, సంజన చౌదరి, సుమన్, భార్గవ్, షేకింగ్ శేషు, జబ్బర్దస్థ్ రాజమౌళి, ఫసక్ శశి, ఫన్ బకెట్ భరత్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి డీఓపీ తిరుమల రోడ్రిగ్జ్, మ్యూజిక్: ఆర్స్, పాటలు : సురేష్ ఉపాధ్యాయ-అల రాజు, సౌండ్ డిజైన్ : యతిరాజ్ , పీఆర్వో : వంగాల కుమారస్వామి, ఎడిటర్: ఎస్ శివ కిరణ్, ఫైట్స్: మిస్టర్ దేవ్, కో-ప్రొడ్యూసర్స్ : రాహుల్ పండిట్, జిఎస్ రావు, వై వెంకట లక్ష్మి, అస్సోసియేట్ ప్రొడ్యూసర్ : యుగంధర్ కొడవటి, ప్రొడ్యూసర్ : పియస్ రామకృష్ణ (ఆర్కే), రచన-దర్శకత్వం: మురళి రామస్వామి (ఎమ్ .ర్).