Advertisement
Google Ads BL

హీరోగా చేయాలని నాకూ ఉంది కానీ : రాక్‌స్టార్


టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరికీ మ్యూజికల్ హిట్స్‌ను అందించి అందరి అభిమానుల మన్ననలు పొందుతూ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్. ప్రస్తుతం సూపర్‌స్టార్‌ మహేశ్‌ హీరోగా దిల్‌ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఔట్‌ అండ్‌ ఔట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. చిత్రానికి స్వరాలను అందించారు. ఇప్పటికే విడుదలైన అన్ని పాటలకు దేశవ్యాప్తంగా ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న సినిమా విడుదలవుతున్న సందర్భంగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మీడియాకు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన మనసులోని మాటలను బయటపెట్టారు.

Advertisement
CJ Advs

మీడియా : మీరు హీరోగా సినిమా చేస్తున్నారనే వార్త చాలా సంవత్సరాలుగా వినిపిస్తోంది. ఆ సినిమా ఎంతవరకూ వచ్చింది ?

రాక్‌స్టార్ : సినిమా చేయమని అడుగుతున్నారు గాని, నాకు మ్యూజిక్ మీద ఉన్న ఇంట్రస్ట్ వల్లనేమో యాక్టింగ్ చేయాలనే ఆసక్తి రావడం లేదు. అయితే నాకు తమిళంలో ఎక్కువమంది కథలు చెబుతున్నారు. సంగీతం ప్రధానంగా సాగే కొత్త కథ ఉంటే ఏదైనా ఉంటే త‌ప్పకుండా చేస్తాను. ప్రస్తుతం నేను సుకుమార్‌-బన్నీల కొత్త చిత్రంతో పాటు ‘ఉప్పెన’, ‘రంగ్‌ దే’, కీర్తి సురేష్‌ చిత్రాలకు స్వరాలు సమకూర్చబోతున్నాను’ అని డీఎస్పీ చెప్పుకొచ్చారు.

వాస్తవానికి.. ‘కుమారి 21ఎఫ్‌’ టైం నుంచే దేవిశ్రీ హీరోగా మారబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలొచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు తాను హీరోగా నటించాలని ఉందని పలుమార్లు తన మనసులోని మాటను ఆయన బయటపెట్టారు కూడా. అంతేకాదు.. ఓ కుర్ర దర్శకుడితో సినిమాకు ఒప్పుకున్నారని.. అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలోనే సినిమా ఉంటుందని కూడా వార్తలు కూడా గుప్పుమన్నాయ్. ఓ యువ దర్శకుడితో ఆయన సినిమా చేయబోతున్నట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి.

News About Rock Star Devi Sri Prasad:

News About Rock Star Devi Sri Prasad  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs