‘ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్’ ఇవ్వండి నేనేంటో నిరూపించుకుంటా అనే డైలాగ్‌తో సినీ నటి సంగీత ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ డైలాగ్ ‘ఖడ్గం’ సినిమా మొదలుకుని ఇప్పటి వరకూ చాలా సార్లే వినే ఉంటాం. అలా సింగిల్ డైలాగ్‌తో పాపులర్ అయిన ఆ ముద్దుగుమ్మ ‘పెళ్లాం ఊరెళితే’, ‘ఖుషీ ఖుషీగా’, ‘సంక్రాంతి’ సినిమాతో పాటు పలు చిత్రాల్లో నటించి మెప్పించి.. అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ హీరోయిన్, గ్లామరస్ నటిగా టాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ 2009 తర్వాత అడ్రస్ లేకుండా లేకపోయింది. ఆ తర్వాత ఇంటి గొడవలతో పలుమార్లు ఆమె వార్తల్లో నిలిచింది. అయితే అలా అడ్రస్ లేకుండా పోయిన సంగీతను ‘సరిలేరు నీకెవ్వరు’ డైరెక్టర్ అనిల్ రావిపూడి మళ్లీ ఆమెతో రీ ఎంట్రీ చేపించారు.
పాత్ర ఎలాంటిదో!?
వాస్తవానికి డైలాగ్ చెప్పడంలో.. డ్యాన్స్ చేయడంలో.. అందం, అభినయంలో ఈమె తర్వాతే ఎవరైనా.. అని అప్పట్లో మంచి టాక్ ఉండేది. అంతేకాదు.. ఇటీవల సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి కూడా సంగీతతో కలిసి డ్యాన్స్ చేయాలని తన కోరిక అని మనసులోని మాట చెప్పారు. ఇక అసలు విషయానికొస్తే.. నాడు ‘ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్’ అంటూ సింగిల్ డైలాగ్‌తో హైలైట్‌గా నిలిచిన ఆమె సరిలేరులో పరిస్థితేంటి..? ఎలాంటి పాత్ర చేసింది..? ఈ సినిమాలో కూడా ఈమెకు సింగిల్ డైలాగ్ ఉందా..? లేదా పేరుకే ఈమెను సినిమాలోకి తీసుకున్నారా..? అనేది మరోసారి చర్చనీయాంశమైంది.
ఇప్పుడు అబ్బబ్బబ్బా..!
కాగా.. సరిలేరు సినిమాలో ‘అబ్బబ్బబ్బా..’ అనే డైలాగ్‌తో మళ్లీ మన ముందుకొస్తొందీ సంగీత. ఈ డైలాగ్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరి హృదయాల్నీ కొల్లగొడుతుంట. ఇటీవల ఓ ప్రముఖ చానెల్ ఇంటర్వ్యూలో భాగంగా చిత్రబృందం తమ సినిమా, షూటింగ్ అనుభవాలను పంచుకుంది. వాస్తవానికి సంగీత పాత్ర గురించి అనిల్ రావిపూడి ఆమె పూర్తిగా చెప్పలేదట. పూర్తిగా నెరేట్ చేస్తే సంగీత ఒప్పుకోదనే నమ్మకంతో సగమే నెరేట్ చేశాడట. మరీ ముఖ్యంగా ‘అబ్బబ్బబ్బా..’ అనే డైలాగ్ గురించి అస్సలే చెప్పలేదట. ఆమె చెప్పిన కథకు.. నటించే పాత్రకు అస్సలు సింక్ కాలేదట. నిజంగా అబ్బబ్బబ్బా.. అనే డైలాగ్ వినగానే ఇదేంటి ఇంత నాటుగా ఉందనుకుందట. అయితే.. సంగీత పాత్ర కూడా సినిమాకి హైలైట్ అవుతుందని.. సినిమాలో అందరూ చాలా బాగా నటించారని విజయ శాంతి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే సంగీత పాత్రగురించికానీ.. తన పాత్ర గురించి విజయశాంతి ఎక్కడా రివీల్ కాలేదు. మరి ఈ ఇద్దరి పాత్ర.. మొత్తమ్మీద సినిమా ఎలా ఉంటుందనే విషయం తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.