మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా విడుదలకు ఇంకా ఒక్కరోజు మాత్రమే టైం ఉంది. ఎందుకంటే రేపు సాయంత్రం నుండే యూఎస్ ప్రీమియర్స్ హడావిడి మొదలై సినిమా టాక్ బయటికొచ్చేస్తుంది. అయితే మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ ఫస్ట్ టాక్ అంటూ సినిమా యూనిట్ చెప్పిన సమాచారంతో.. ఇప్పుడొక న్యూస్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా మొత్తం ఎంటర్‌టైనింగ్‌గా ఉందని.. ఈ సినిమాతో మహేష్ బాబు మరోసారి బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేయడం ఖాయం అంటున్నారు. అయితే కామెడీ సూపర్ అనేలా ఉన్నప్పటికీ.. రొటీన్ యాక్షన్ డ్రామా కావడం ఒక్కటే ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు మైనస్ అయ్యేలా ఉంటుందేమో అంటున్నారు.
మొదటి నుంచి చెప్పినట్టుగా ట్రైన్ కామెడీ అదుర్స్ అన్న రేంజ్‌లో ఉందని.. ఈ 39 నిమిషాల ట్రైన్ జర్నీలోనే రష్మిక ఫ్యామిలీ అంతా కలిసి మహేష్ పడేసి.. రష్మికను మహేష్ బాబుకు ఇచ్చి పెళ్లి చేసేందుకు రష్మిక కుటుంబం పడే తంటాలు కామెడీ రూపంలో చూపించాడని అందులోనే ఓ ఫైట్ సీన్ కూడా ఉండబోతుందట. ఇక కామెడీతో పాటుగా తమన్నా ఐటెం సాంగ్ అదుర్స్ అని.. అలాగే సెకండ్ హాఫ్‌లో విజయశాంతి రోల్ బాగుంటుందని.. విజయశాంతి సరిలేరు కథకు ఆయువు పట్టు అని తెలుస్తుంది. విజయశాంతి కోసమే మహేష్ ఆర్మీ నుంచి సమాజంలోకి వస్తాడని.. ఇంకా ప్రకాష్ రాజ్ ఎప్పటిలాగే విలన్‌గా రప్ఫాడించాడని.. ఈ పండక్కి బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ ‘సరిలేరు నీకెవ్వరు’ యూనిట్ చెబుతుంది. మరి రేపు సాయంత్రానికల్లా సరిలేరు టాక్ బయటికొచ్చేస్తుందిలే తొందరెందుకు.