శైలేష్, ఏఇషా ఆదరహ హీరో హీరోయిన్లు గా భీమవరం టాకీస్ బ్యానర్‌లో రామసత్యనారాయణ నిర్మించిన 98 వ చిత్రం‘శివ 143’(ది జర్నీ ఆఫ్ టూ హార్స్) మూవీ సాంగ్ ను జె.డి చక్రవర్తిగారి చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది.
అనంతరం జె.డి.చక్రవర్తి మాట్లాడుతూ.. ‘గతంలో ట్రైలర్ చూసాను. సాగర్ హీరో గా డైరెక్టరగా.కథ,స్క్రీన్ ప్లే,కొరియోగ్రాఫర్ ఇలా అన్నీ అతనే అని అక్షర్యపోయాను.రామసత్యనారాయణ మొదటి సినిమా కే కాకుండా రెండో సినిమా కూడా ఇవ్వడం అంటే అక్షర్యపోయాను. అంటే సాగర్ ఎంత హార్డ్ వర్క్ చేసి నమ్మకం కలిగించి ఉంటేనే.రామసత్యనారాయణ రెండో సినిమా ఇచ్చి ఉంటాడో అర్థమౌతుంది.రామసత్యనారాయణ గారు ఎంతో మంచివారు, వారికి తన మన అనే బేధం లేదు తన సినిమా అయినా పరాయి సినిమా అయినా ఒకటే.డైరెక్టర్ తో నాకు పెద్దగా పరిచయం లేదు కానీ తను చేసిన రహస్యం సినిమా స్క్రీన్ ప్రెజెంట్ గాని, యాక్షన్ సీక్వెన్స్ గాని అద్భుతంగా ఉన్నాయి.డి.యస్.రావు చాలాకాలంగా తెలుసు, నాకు మంచి మిత్రుడు కూడా, ఈ మధ్య మంచి పాత్రలు పోషిస్తున్నాడు,ఈ సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ చేస్తున్నానాని చెప్పాడు.ఆయన ఇలాగే మంచి చిత్రాలలో నటించాలని కోరుకుంటున్నాను. మా సత్య కు సినిమా అంటే పిచ్చి.. సినిమాను సినిమాగా ప్రేమించే వీరు ఎంతో కష్టపడి చేసిన ఈ శివ143 సినిమా వీరందరికీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు మాట్లాడుతూ.. ‘శివ 143 మూవీ సంక్రాంతి కి విడుదలకు సిద్ధం చేసాం.థియేటర్స్.డిస్ట్రిబ్యూటర్స్ అన్ని రెడి..కానీ సెన్సార్ అవ్వని కారణం చేత సంక్రాంతి కి విడుదల చేయకుండా సినిమాను పోస్ట్ ఫోన్ చేసుకున్నాము..త్వరలోనే ఈ నెల లొనే సినిమా విడుదల తేదీని.ప్రకటన చేస్తాము. ఈ శివ 143 సినిమాకు ఇన్సపిరేషన్ నలుగురు ఉన్నారు వారు కళ్యాణ్. రాంగోపాల్ వర్మ,జె.డి.చక్రవర్తి,పోసాని కృష్ణ మురళి వీరి నాలుగురికి నేనంటే ఇష్టం.వీరునన్ను ఎప్పుడు అభిమానిస్తారు.వీరెప్పుడూ నాకు అందుబాటులో ఉంటారు.నాకు ఎం సహాయం కావలసి వచ్చినా చేసే మనుషులు వీరు.ఈ రోజు జె.డి.చక్రవర్తి గారు శివ 143 సినిమా సాంగ్ ను లాంచ్ చేశారు.శివ అంటే మా గురువు గారు ఆర్. జి.వి గారు,143 అంటే పూరి జగన్నాథ్ గారిది వీరిద్దరినీ ఇష్టపడే వ్యక్తి మా డైరెక్టర్. మా డైరెక్టర్ నాకు రేమ్యూనిరేషన్ తక్కువ ఇచ్చిన పరవాలేదు కానీ కల్యాణ్. వర్మ,పూరి,జె.డి గార్లను పరిచయం చేయమని కోరాడు.దాంతో జె.డి గారిని రిక్వెస్ట్ చేసి సాంగ్ లాంచ్ చేయమని కోరితే నీకు తెలుసుగా నేను ఏ సినిమా ఫంక్షన్స్ కు రానని అన్నారు. నేను తప్పక రావాలని కోరితే మా ముఖం లో ఆనందం చూడడం కోసం రావడానికి ఒప్పుకొని వచ్చి మా శివ143 సినిమా సాంగ్ లాంచ్ చేసినందుకు ధన్యవాదాలు,జె.డి చక్రవర్తి గారు మాట్లాడింది యదార్థం..సినిమాని ప్రేమించే మాకు ఎప్పుడు సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాం’ అని అన్నారు.
హీరో, డైరెక్టర్ సాగర్ శైలేష్ మాట్లాడుతూ.. ‘సత్యనారాయణ గారు వచ్చి సాంగ్ లాంచ్ కు జె.డి.చక్రవర్తి గారు రావడానికి ఒప్పుకున్నారని చెప్పగానే నేను నమ్మలేదు,జెడి గారు సాంగ్ లాంచ్ కు రాగానే అంత సీనియర్ అయ్యి ఉండి, నా దగ్గరకు వచ్చి నువ్వు తీసిన సినిమా యాక్షన్ స్సేక్వెన్స్ బాగున్నాయి అనగానే చాలా ఎగ్జైట్ గా ఫీల్ అయ్యాను,ఎందుకంటే నేను తీసిన ఒక సినిమానే గుర్తు పెట్టుకివాల్సిన అవసరం లేదు,కానీ ఆ సినిమా గురుంచి మాట్లాడం తో నాకు ఈ అప్రిసెషన్ చాలు ఇక నా జన్మ ధన్యమైనట్లు అనిపించింది.నన్ను నమ్మి నాకీ 2వ అవకాశం ఇచ్చిన రామసత్యనారాయణ సార్ కు నా ధన్యవాదాలు అని అన్నారు..
నటీనటులు :-
సాగర్ శైలేష్, ఎఇషా ఆదరహ, హృతిక సింగ్, డి.ఎస్.రావ్, ప్రియ పాలువాయి,రామసత్యనారాయణ
సాంకేతిక నిపుణులు :-
మ్యూజిక్: మనోజ్ కుమార్ చేవూరి
ఎడిటర్: శివ వై ప్రసాద్..
కెమెరామెన్: సుధాకర్ అక్కినపల్లి.
ట్రైలర్ కట్ & సిజీ: నరేన్.
పీఆర్ఓ: మధు వి.ఆర్.
నిర్మాత: రామసత్యనారాయణ.
కథ, స్క్రీన్ ప్లే, స్టట్స్, డాన్స్, కొరియోగ్రఫి, డైరెక్షన్: శైలేష్ సాగర్