Advertisement
Google Ads BL

అనసూయకి షాకిచ్చిన విజయశాంతి!


చిరంజీవి-కొరటాల కాంబో మూవీ ఈ నెలాఖరు నుండి పట్టాలెక్కబోతుంది. కొరటాల శివ పక్కా స్క్రిప్ట్‌తో చిరు సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక చిరు కొరటాల శివ కోసం ఒళ్ళు తగ్గించి ఫిట్‌గా ఉండాలని ప్రిపేర్ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా చేస్తోందనే టాక్ ఉంది. అయితే ఈ సినిమాలో ‘రంగస్థలం’ లో రంగమ్మత్తగా అదరగొట్టిన అనసూయకి ఓ కీ రోల్‌ని కొరటాల సిద్ధం చెయ్యడం దానికి చిరు ఓకే చెప్పడంతో.. అనసూయ, కొరటాల-చిరు సినిమాలో ఫిక్స్ అన్నారు. అయితే తాజాగా చిరంజీవి, అనసూయకి షాకిచ్చి ఆమె పాత్రకి మరొక హీరోయిన్‌ని తీసుకోబోతున్నాడనే టాక్ నడుస్తుంది.

Advertisement
CJ Advs

‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాలో భారతిగా రీ ఎంట్రీ ఇస్తున్న విజయశాంతి ఈ మధ్యన ‘సరిలేరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరుని కలవడం పెద్ద సెన్సేషన్ అయ్యింది. చిరు-విజయశాంతి కలిసి దాదాపుగా 20 సినిమాలు చెయ్యడం.. సరిలేరు ఈవెంట్‌లో చిరు ఆప్యాయంగా విజయశాంతితో మాట్లాడం.. అలాగే సరిలేరు ఈవెంట్‌లో మహేష్ కన్నా ఎక్కువగా చిరు-విజయశాంతిల కలయిక హైలెట్ అవడంతో.. చిరు ఎలాగైనా తన నెక్స్ట్ సినిమాలో విజయశాంతికి ఓ రోల్ ఇవ్వాలని.. అది అనసూయ చెయ్యబోయే పాత్రనే కొద్దిగా నిడివి పెంచి అనసూయని తప్పించి విజయశాంతితో ఆ రోల్ చేయించాలనే ఆలోచనలో ఉన్నట్లుగా ఫిలింనగర్ టాక్. ఇక చిరు ఆలోచనకు కొరటాల కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా చెప్పడం.. దానితో అనసూయకి అలా చిరు షాకిచ్చాడంటూ సోషల్ మీడియాలో న్యూస్‌లు కూడా హల్‌చల్ చేస్తున్నాయి.

Lady Amithab Vijayasanthi Gives Shock To Anchor Anasuya:

Lady Amithab Vijayasanthi Gives Shock To Anchor Anasuya  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs