Advertisement
Google Ads BL

‘బుట్ట బొమ్మ’ టీజర్‌కు టెర్రిఫిక్ రెస్పాన్స్


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో’. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్, గీతాఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై అల్లు అరవింద్‌, ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2020 సంక్రాతి కానుకగా చిత్రం విడుదల అవుతోంది. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా పాట‌లు, టీజ‌ర్‌, థియేట్రికల్ ట్రైలర్ కి  ట్రెమెండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్పడ్డాయి. 

Advertisement
CJ Advs

ఈ చిత్రానికి సంబంధించి  ఈ రోజు ఉదయం ‘బుట్ట బొమ్మ’ సాంగ్ ప్రోమో వీడియో చిత్ర బృందం విడుద‌ల చేసింది. ఇందులో అల్లు అర్జున్, పూజా స్టైలిష్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. బ‌న్నీ వేసే స్టెప్స్కు ఫ్యాన్స్‌ ను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. జానీ మాస్టర్ కంపోజ్ చేసిన నృత్య రీతులు అలరిస్తున్నాయి. సాంగ్‌లోని సెట్ కూడా చాలా అందంగా క‌నిపిస్తుంది. గీత రచయిత రామ‌జోగ‌య్య శాస్త్రి సాహిత్యాన్ని  అందించ‌గా, ఆర్మాన్ మాలిక్ ఆలపించారు. ఇటీవల జరిగిన ఈ చిత్ర మ్యూజికల్ కన్సర్ట్ లో ఆర్మన్ ఈ పాటకు లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వటం ఆహుతులను ఆకట్టుకున్న విషయం విదితమే.

సౌత్ ఇండియన్ క్రేజీ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, కల్యాణి నటరాజన్, రోహిణి, ఈశ్వరీ రావు, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, రాహుల్ రామకృష్ణ, పమ్మి సాయి నటిస్తున్నారు. డి.ఓ.పి: పి.ఎస్.వినోద్, సంగీతం: థమన్.ఎస్, ఎడిటర్: నవీన్ నూలి: ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, ఫైట్స్: రామ్ - లక్ష్మణ్, పి.ఆర్.ఓ: లక్ష్మీవేణుగోపాల్, ఏలూరు శ్రీను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్, నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు)

Butta Bomma promo excels in every aspect:

Butta Bomma promo excels in every aspect
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs