Advertisement
Google Ads BL

‘సరిలేరు..’లో కృష్ణ స్పెషల్ ఎంట్రీ.. పాత్ర ఇదేనా!?


సూపర్‌స్టార్ మహేశ్ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని.. మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా పిలిపించి గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా పూర్తి చేసుకుంది. ఈ నెల 11న సరిలేరు థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన లుక్స్, టీజర్-ట్రైలర్స్, సాంగ్స్ అదిరిపోగా.. ప్రమోషన్ పరంగా కూడా చిత్రబృందం యమా స్పీడ్‌తో దూసుకెళ్తోంది. అయితే సినిమాలో మహేశ్, విజయశాంతి, రష్మిక మందన్నా పాత్రలపై కొన్ని లీక్స్.. అంతకంటే ఎక్కువగా పుకార్లు షికార్లు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా మరో ఆసక్తరమైన విషయం వెలుగుచూసింది.. ఆసక్తికరమైన అనడం కంటే ఘట్టమనేని ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. డబుల్ కిక్కే అని చెప్పొచ్చేమో!!

Advertisement
CJ Advs

ఈ సినిమాలో సూపర్‌స్టార్ కృష్ణ ఓ పాత్రలో చేస్తున్నారట. అది కూడా స్పెషల్ ఎంట్రీ కావడం విశేషమని చెప్పుకోచ్చు. సీనియర్ సూపర్‌స్టార్.. జూనియర్ సూపర్‌స్టార్ ఇద్దరూ ఒకే సినిమాలో కనిపిస్తే ఇక ఘట్టమేనేని ఫ్యాన్స్‌ ఆనందానికి అవధులుండవ్ అంతే. అయితే ఆ స్పెషల్ ఎంట్రీ ఎలా ఉండబోతోంది..? అసలు ఇందులో నిజానిజాలెంత అనేది మాత్రం తెలియరాలేదు.

అయితే లాయర్ లేదా పెద్ద మనిషి తరహాలో వచ్చి పంచాయితీ చేస్తారని సరిగ్గా కృష్ణ మూడు నిమిషాలు మాత్రమే ఉండి ఇలా వచ్చి అలా మెరుపుతీగలాగా వెళ్లిపోతారట. అయితే ఈ స్పెషల్ ఎంట్రీ విషయాన్ని ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి చెప్పడంతో మహేశ్ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. అయితే ఆ పాత్ర ఏంటి..? ఎలా ఉంటుందనే విషయం మాత్రం సస్పెన్స్ అని అనిలే చెప్పడంతో ఫ్యాన్స్ ఎగిరిగంతులేస్తున్నారు. సీనియర్ సూపర్‌స్టార్ పాత్రేంటో తెలియాలంటే జనవరి 11వరకు తప్పదు మరి.

Super star Krishna Role In Sarileru Neekevvaru.. Here Details!:

Super star Krishna Role In Sarileru Neekevvaru.. Here Details!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs