Advertisement
Google Ads BL

వైసీపీ తరఫున రాజ్యసభకు చిరు, మోహన్ బాబు!?


అవును మీరు వింటున్నది నిజమే.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి టాలీవుడ్‌కు ఇద్దరు ప్రముఖును పెద్దల సభ అయిన రాజ్యసభకు పంపనున్నారు. త్వరలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఆ స్థానాల కోసం ఇప్పటికే పలువురు ప్రముఖులు, పేరు మోసిన బిజినెస్‌మెన్లు, ఉద్ధండులు లైన్‌లో ఉండగా జగన్ మాత్రం డైలాగ్ కింగ్ మోహన్‌బాబు, మెగాస్టార్ చిరంజీవిని రాజ్యసభకు పంపాలని భావిస్తున్నారట. ఇప్పటికే ఈ విషయమై అధిష్టానంతో చర్చించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే పంచాయితీ ఎన్నికల అనంతరం అధికారికంగా ప్రకటన చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి.

Advertisement
CJ Advs

ఇప్పటికే ఇద్దరూ..!

వాస్తవానికి చిరు, మోహన్ బాబు ఇద్దరూ ఇటు సినిమాల్లో.. అటు రాజకీయాల్లో పండిపోయిన వారే.. ఇప్పటికే ఇద్దరూ రాజ్యసభకు వెళ్లొచ్చారు. మెగాస్టార్.. కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్‌లో విలీనం చేయడం.. ఆయన్ను రాజ్యసభకు పంపడం.. నాడు అధిష్టానం కేంద్రమంత్రిని చేయడం ఇవన్నీ జరిగిపోయాయ్.. అయితే పదవీ కాలం ముగియడం.. మరోవైపు సినిమాలపై మళ్లీ దృష్టి సారించిన చిరు.. రాజకీయాలకు గ్యాప్ ఇచ్చారు. అంతేకాదు.. ఇక రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వరాదని.. తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన ‘జనసేన’ ఒంటరిగా 2019 ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ చిరు మాత్రం ఆ పార్టీ ఊసే ఎత్తలేదు.

పవన్ స్పీడ్‌కు బ్రేక్ వేయాలంటే!

ఎన్నికల్ల్లో ఘన విజయం సాధించిన తర్వాత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ఫోన్ చేశారని అప్పట్లో వార్తలు కూడా గుప్పుమన్నాయ్. మరోవైపు.. ‘సైరా’ సినిమా టైమ్‌లో చిరు.. జగన్‌ను కలవడం కంగ్రాట్స్ చెప్పడం.. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఆయన సాదరంగా స్వాగతిస్తూ మద్దతివ్వడం జరిగింది. వాస్తవానికి ఎప్పట్నుంచో చిరు-వైఎస్ కుటుంబానికి చాలా మంచి సంబంధాలున్నాయ్. పవన్ స్పీడ్‌కు బ్రేకులు వేయాలంటే చిరును పార్టీలోకి ఆహ్వానించి.. రాజ్యసభకు పంపి గౌరవించాలని జగన్ భావిస్తున్నారట. అంతేకాదు ఇండస్ట్రీ పరంగా పార్టీకి సపోర్ట్.. చిరు ఇమేజ్ కలిసొచ్చినట్లుందని వైసీపీ ప్లాన్ వేసిందట. ఈ సీటు విషయమై చిరు చెవిన కూడా పడేయగా.. మొదట వద్దన్నప్పటికీ నిశితంగా ఎంపీ విజయసాయిరెడ్డి, జగన్ ఇద్దరూ కూర్చొబెట్టి మాట్లాడగా ‘నవ్వుతూ.. సరే..’ అన్నారట. ఇదే జరిగితే పవన్ పరిస్థితి ప్రశ్నార్థకమేనేమో..!

రాజ్యసభలో ఇక డైలాగ్స్ పేలతాయ్!!

వైఎస్ ఫ్యామిలీ ఆడపడచును తన కోడలిగా చేసుకున్న మంచు మోహన్ బాబుకు ఆ కుటుంబంతో చాలా మంచి సన్నిహిత సంబంధాలున్నాయ్. అంతేకాదు.. వైఎస్ జగన్‌ను కలవాలంటే ఎలాంటి పర్మిషన్ లేకున్నా డైరెక్ట్‌గా వెళ్లి కలిసేంత చనువు ఉంది. అలాంటి మోహన్‌బాబు ఎన్నికలకు ముందు జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయనకు ఏదైనా పదవి ఇవ్వాలని జగన్ భావించినప్పటికీ ఏదీ వర్కవుట్ కాలేదు. అంతేకాదు.. అప్పట్లో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతికి కూడా పదవులు ఇవ్వడం.. తనకెలాంటి గౌరవం ఇవ్వలేదని హర్ట్ అయిన మోహన్ బాబును రాజ్యసభకు పంపి శాంత పరచాలని జగన్ భావిస్తున్నారట. మరోవైపు ఇటీవలే మోహన్ బాబు ఫ్యామిలీ ప్రధాని నరేంద్రమోదీని కలవడంతో పెద్దల సభకు పంపే ప్రక్రియను వీలైనంత త్వరగా చూడాలని వైసీపీ పెద్దలను జగన్ ఆదేశించారట. 

ఎప్పట్నుంచో మోహన్ బాబు రాజ్యసభకు పక్కా అని వార్తలు వచ్చాయ్.. అయితే ఆయన వెళ్లితే పెద్దల సభలో డైలాగ్స్ పేలడం పక్కా అని తెలియవచ్చింది. చిరు విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు.. పైన చెప్పిన వార్తలో నిజానిజాలెంత అనేది తెలియాల్సి ఉంది. ఈ వ్యవహారంపై క్లారిటీ రావాలంటే వైసీపీ నుంచి ఎవరైనా పెద్దలు కానీ.. లేదా చిరునే స్పందిస్తే గానీ క్లారిటీ వచ్చేలేదు.         

News About Mohan Babu and Chiru Rajya sabha Seats:

News About Mohan Babu and Chiru Rajya sabha Seats
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs