Advertisement
Google Ads BL

ఈసారి అనిల్ రావిపూడి లక్కేలా ఉందో?


అనిల్ రావిపూడి ఎఫ్ 2 వరకు యావరేజ్ సినిమాల్తోనే లాక్కొచ్చాడు. కానీ ఎఫ్ 2 తో మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టాడు. అయితే అనిల్ రావిపూడి ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ అవడం మాత్రం నిజంగా లక్కనే చెప్పాలి. ఎందుకంటే గత సంక్రాంతికి విడుదలైన ఎఫ్ 2 ఫస్ట్ హాఫ్ సూపర్ హిట్ టాక్ ని సెకండ్ హాఫ్ ని సో సో టాక్ తెచ్చుకుంది. కానీ గత సంక్రాంతికి విడుదలైన వినయ విధేయరామ డిజాస్టర్ అవడం, కథానాయకుడు ప్లాప్ అవడంతో.. ఎఫ్ 2 కి అదృష్టం కలిసొచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది. అందులో జనవరి నెలాఖరు వరకు ఎలాంటి సినిమాలు ఎఫ్ 2 కి పోటీకి లేకపోవడం కూడా కలిసొచ్చి కలెక్షన్స్ పంట పండింది. కాని ఈసారి మహేష్ సరిలేరు నీకెవ్వరూ సినిమాకి అల్లా వర్కౌట్ అయ్యి.. అనిల్ కి కలిసొస్తుంది అంటే నమ్మకం చాలడం లేదు.

Advertisement
CJ Advs

సరిలేరు నీకెవ్వరూ సినిమా మొత్తం అనిల్ మార్క్ కామెడీ, మహేష్ ఫాన్స్ కోసం యాక్షన్ కలగలిపిన సినిమా అది. అనిల్ మార్క్ కామెడీ లో మహేష్ తో కూడా కావాల్సినంత కామెడీ పండించడమే కాదు.. రష్మిక చేత.. కామెడీ బ్యాచ్ చేత హిలేరియస్ కామెడీ పండించాడనేది ట్రైలర్ చూస్తే తెలిసిందే. ఇక ఇక్కడ మరో విషయం యాక్షన్ ప్యాకేజ్. మహేష్ ఫాన్స్ కోసం యాక్షన్ కూడా దండిగానే పెట్టాడు. అది కూడా సాదాసీదా యాక్షన్ కాదు.. పవర్ ఫుల్ యాక్షన్ ఉంది. సో కామెడీ సో సో గా ఉన్న సినిమా యాక్షన్ లేపుతుంది. లేదా యాక్షన్ సో సో గా ఉన్న సినిమాని కామెడీ లేపుతుంది. అయితే ఈ సినిమా కామెడీ కన్నా ఎక్కువగా యాక్షన్ వర్కౌట్ అయ్యేలా కనబడుతుంది. మహేష్ - ప్రకాష్ రాజ్ - విజయశాంతి కాంబో సీన్స్ సినిమాకే హైలెట్ అనేలా ఉంది సరిలేరు ట్రైలర్ చూస్తుంటే. ఇక సరిలేరు సినిమాకి సూపర్ హిట్ టాక్ పడితేనే కానీ.. లేదంటే అల వైకుంఠపురములో సరిలేరు కి చెక్ పెట్టేస్తుంది. ఇక దర్బార్, ఎంత మంచివాడవురా సినిమాలేమి సరిలేరు, అల వైకుంఠాన్ని టచ్ చేయలేకపోయినా.. ఎంతో కొంత ప్రభావం అయితే చూపుతాయి. 

How Is Anil Ravipoodi Lucky.. Sarileru Neekevvaru:

How Is Anil Ravipoodi Lucky.. Sarileru Neekevvaru  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs