Advertisement
Google Ads BL

నిర్మాతలకేమో గానీ... ప్రేక్షకుల జేబులకు చిల్లు?


సంక్రాతి సినిమాల మోజులో ప్రేక్షకుల జేబులకు చిల్లులు గ్యారెంటీ.. ఎందుకంటే టికెట్స్ రేట్లు పెరుగుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా మల్టిప్లెక్స్ లో 150 ఉన్న టికెట్ ధర గత నెల రోజుల్లో ఏకంగా 200 కి పెరిగిపోయింది. ఇది ప్రేక్షకులు అస్సలు ఊహించలేదు. సైలెంట్ గా టికెట్స్ రేట్స్ పెంచేశారు తెలంగాణాలో. తాజాగా ఆ 200 టికెట్ ధర ఇప్పుడు 250 కి పెరగబోతుంది. భారీ బడ్జెట్ లతో సినిమాలు నిర్మిస్తుంటే.. ఒక్కవారానికే థియేటర్స్ ఖాళీ అవుతున్నాయి అని నిర్మాతలనాథ ఏకపక్షాన టికెట్స్ రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ.. ప్రేక్షకులను బకరాలను చేస్తున్నారు. గతంలో పెద్ద సినిమాలు విడుదలైన మొదటి వారం 200 టికెట్ ధర ఉండి... తర్వాత 150 కి తగ్గేవి. కానీ ఇప్పుడు ఏకంగా మొత్తంగా సినిమా కి వెళ్ళాలి అంటే 200 రూపాయలు పెట్టి టికెట్ కొనాల్సిందే. తాజాగా సంక్రాంతి సినిమాలకు ఏకంగా 250 రూపాయలు పెట్టుకుని సినిమా చూడాల్సిందే. మరి ఫాన్స్ కి తప్పదు కానీ ప్రేక్షకులకు కూడా 250 అంటే మాములు విషయం కాదు. కానీ భారీ బడ్జెట్ నిర్మాతలు తమకి డబ్బులు రావడం లేదంటూ గోల పెడుతూ అధికారుల నుండి అనుమతులు కోరుతున్నారు.

Advertisement
CJ Advs

అల వైకుంఠపురములో, దర్బార్, సరిలేరు నీకెవ్వరూ, ఎంతమంచివాడవురా  సినిమాలు ఈ సంక్రాంతికి పోటీపడుతుంటే. థియేటర్ యాజమాన్యాలు టికెట్స్ రేటు పెంపుకు పోటీ పడుతున్నారు అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సంక్రాంతికి ఆంధ్రాలో టికెట్ రేట్లు కూడా ఆకాశాన్ని తాకనున్నాయని.. సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధర 200కి, మల్టీప్లెక్స్ టికెట్ ధర 250 రూపాయల చొప్పున టికెట్ రేట్లు పెరగనుంది. మరి తెలంగాణాలో ఆంధ్రలో సినిమా చూసే ప్రేక్షకుడికి జేబులు చిల్లులు గ్యారెంటీ అన్న రేంజ్ లో థియేటర్ యాజమాన్యాలు ఈ టికెట్ రేట్లు పెంచేస్తున్నాయి. ఏరియాల వారీగా సినిమా హక్కులు కొనే డిస్ట్రిబ్యూటర్స్ సినిమా పంపిణి కోసం పోటీపడి ధరలు చెల్లించి.. మల్లి తమ డబ్బు వెనక్కి లాగడానికి టికెట్స్ రేట్లు పెంచి పండగ వాతావరణాన్ని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాయి.

Cine Viewers Loss Their Money.. !:

Cine Viewers Loss Their Money.. !  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs