Advertisement
Google Ads BL

అయ్యో మళ్లీ ఏంటిది మహేశ్.. ఇలాగైతే ఎలా!?


టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు మళ్లీ మళ్లీ అదే తప్పు చేయడం.. తర్వాత మళ్లీ గుర్తు చేసుకుని అయ్యో.. మరిచితినే అంటూ మాట్లాడటం మామూలైపోయింది. ‘మహర్షి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఏ తప్పయితే మహేశ్ చేశాడో.. సేమ్ టూ సేమ్ సీన్ ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో రిపీట్ చేశాడు. ఇంతకీ మహేశ్ చేసిన ఆ తప్పేంటి..? నిజంగా ఆయన చేసిన తప్పు అంత పెద్దదా..? లేకుంటే సింపులా..? అనే ఆసక్తికర విషయాలను ఇప్పుడు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

Advertisement
CJ Advs

అన్నీ విషయాలు చెప్పి..!

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా ప్రీరిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు మెగాస్టా్ర్ చిరంజీవి రావడంతో.. మెగాసూపర్ స్టార్‌ ఇంకాస్త గ్రాండ్ సక్సెస్ అయిపోయింది. ఇక ఇటు మెగాభిమానులు.. అటు ఘట్టమనేని అభిమానులతో స్టేడియం కిక్కిరిసింది. కార్యక్రమంలో భాగంగా సూపర్ స్టార్ మహేశ్ మాట్లాడుతూ చిత్ర యూనిట్, మెగాస్టార్, మరీ ముఖ్యంగా ఈవెంట్ రోజే.. డైరెక్టర్ అనిల్ రావిపూడి, సూపర్ హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు ఇళ్లలో జరిగిన శుభపరిణామాల గురించి, వీరాభిమానులు గురించి.. ఇలా అన్నీ విషయాలు మహేశ్ మాట్లాడాడు.

అప్పుడు జగన్.. ఇప్పుడు డీఎస్పీ!

అన్నీ మాట్లాడిన మహేశ్.. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేసిన దేవీ శ్రీ ప్రసాద్‌ గురించి మాట్లాడటం.. కనీసం ఆ పేరెత్తడమే మహేశ్ మరిచిపోయాడు. మళ్లీ గుర్తుకుతెచ్చుకున్నాడో.. లేకుంటే ఎవరైనా గుర్తు చేశారో తెలియట్లేదు కానీ.. రెండోసారి మైకు తీసుకుని సారీ డీఎస్పీని మరిచిపోయానని చెబుతూ దేవీ శ్రీ తనకు ఓ స్పెషల్ అంటూ రెండు ముక్కల్లో చెప్పేశాడు. కాగా.. డీఎస్పీని మరిచిపోయినప్పుడు అందరూ ‘మహర్షి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ‘పోకిరి’ సినిమాతో తనను సూపర్‌స్టార్‌ను చేసిన పూరీ జగన్నాథ్‌ను మరిచిపోవడంతో రకరకాలుగా ఇటు సోషల్ మీడియాలో అటు.. టాలీవుడ్‌లో టాక్ రాగా చివరికి సారీ జగన్ అంటూ పూరీ గురించి ఓ ట్వీట్ చేశాడు మహేశ్. వాస్తవానికి స్టేజ్‌ ఎక్కితే ఎలాంటి వారికైనా కాస్త భయం అనేది ఉంటుంది.. అంత మంది ఫ్యాన్స్ ముందు.. స్టేజ్‌పై ఉన్న పెద్దల ముందు మాట్లాడటం అంటే ఆషామాషీ విషయం కాదు. అయితే.. నెటిజన్లు, డీఎస్పీ వీరాభిమానులు మాత్రం అయ్యో.. మళ్లీ ఏంటిది మహేశ్.. ఇలాగైతే ఎలా.. పదే పదే ఇలా చేస్తే ఎలా చెప్పండి!? అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి కొందరు మాత్రం మళ్లీ గుర్తు చేసుకుని మరీ చెప్పాడుగా ఇక లైట్ తీస్కోండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Mahesh Ignored.. same Scene Repeat!!:

Mahesh Ignored.. same Scene Repeat!!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs