ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ రేంజ్ హీరోయిన్స్ ఎవరయ్యా అంటే.. స్టార్ హీరోల పక్కన లెక్కకు మించి సినిమాలు చేస్తున్న పూజా హెగ్డే, రష్మిక మందన్న పేర్లే చెబుతారు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు అన్నట్టుగా ఇద్దరూ హీరోయిన్స్ స్టార్ హీరోలతో జోడీ కడుతున్నారు. తాజాగా ఈ భామలు నటించిన సినిమాలు ఒకదానితో మరొకటి పోటీకి సిద్ధమయ్యాయి. రష్మిక, మహేష్ తో సరిలేరు నీకెవ్వరు సినిమాతోనూ, పూజా హెగ్డే అల్లు అర్జున్ తో అల వైకుంఠపురములో సినిమాతోనూ పోటీపడుతున్నారు. అయితే ఈ రెండు సినిమాల్లోనూ ఎవరి పాత్ర ఎక్కువ ఎవరి పాత్ర తక్కువ అంటే.. సినిమా విడుదల కాకముందు చెప్పడం కష్టం కానీ.. తాజా వ్యవహారం చూస్తుంటే రష్మిక కన్నా పూజానే ఎక్కువగా హైలెట్ అవుతుంది. స్వతహాగా త్రివిక్రమ్ కి హీరోయిన్స్ మీదున్న సాఫ్ట్ కార్నర్ తో పూజా హెగ్డేని మొదటి నుండి హైలెట్ చేస్తుంటే దర్శకుడు అనిల్ రావిపూడి అవసరమైనప్పుడు రష్మికని బయటికి తీస్తున్నాడు.
మరి పూజా హెగ్డేకి బాగా ఇంపార్టెన్స్ ఉందని ఆమె మీద సాంగ్స్ మాత్రమే కాదు.... లిరికల్ వీడియోస్ లోను పూజా హెగ్డే గ్లామరస్ అందాలు బయటికి తీస్తున్నారు. బుట్టబొమ్మ సాంగ్ వీడియోలో పూజా హెగ్డే అందాలు సాంగ్ కే హైలెట్ అనేలా ఉన్నాయి. ఇక రష్మిక ఎంతగా అందంగా గ్లామరస్ గా కనబడాలని తాపత్రయపడినా ఆమెకి గ్లామర్ అనేది ఆమడ దూరమనేలా ఉంటుంది. ఇక రష్మిక - మహేష్ రొమాంటిక్ లుక్స్ బావున్నాయి. కానీ బన్నీ - పూజా కాంబో పిక్స్ అంత కాదు. తాజాగా రష్మిక - మహేష్ ల మాస్ లుక్ ఆకట్టుకునేలా ఉంది. ఇక పూజా గ్లామర్ యాంగిల్ ముందు రష్మిక గ్లామర్ తేలిపోవడం ఖాయంగా కనబడుతుంది. మరి సినిమా విడుదలయ్యాక ఎవరి పాత్రలకు ఎంత ప్రాధాన్యత ఉందో ఆనేది తెలుస్తుంది.