Advertisement
Google Ads BL

నటించాలంటే.. విజయశాంతి కండీషన్స్!


అనిల్ రావిపూడి... విజయశాంతిని రాజా ది గ్రేట్ సినిమాలో రవితేజకి తల్లి పాత్ర ద్వారానే రీ ఎంట్రీ ఇప్పించాలని చూసినా ఆప్పట్లో విజయశాంతి రవితేజ లాంటి హీరోతో రీ ఎంట్రీకి ఇష్టపడకపోయినా...  మహేష్ సినిమాలో ఇంపార్టెంట్ పాత్ర అనగానే సరిలేరు నీకెవ్వరు కోసం వచ్చేసింది. సరిలేరు నీకెవ్వరు సినిమా విషయంలో విజయశాంతిని మహేష్ తో సమానంగా ట్రీట్ చేస్తున్నారు యూనిట్ సభ్యులు. అలాగే మహేష్ కి సమానమైన పబ్లిసిటీ కూడా ఆమెతో చేయిస్తున్నారు. ఈ సినిమాతో విజయశాంతి పక్కాగా రీ ఎంట్రీ ఇచ్చి మరిన్ని అవకాశాలతో దూసుకుపోవాలని సరిలేరు ప్రమోషన్స్ లో ఉండి తనని తానుగా ప్రమోట్ చేసుకోవడం మొదలెట్టింది.

Advertisement
CJ Advs

ఇక సరిలేరు తర్వాత విజయశాంతి ముందు దర్శకనిర్మాతల క్యూ ఎక్కువైందట. అయితే లేడి సూపర్ స్టార్ మాత్రం తనకొచ్చే ఆఫర్స్ ని గుడ్డిగా ఒప్పేసుకోకుండా కండిషన్స్ పెడుతుందట. అది కూడా అలాంటి ఇలాంటి డిమాండ్ కాదు. హీరోతో సమానమైన పవర్ ఫుల్ కేరెక్టర్ తో పాటుగా స్టార్ హీరోయిన్‌ స్థాయిలో రెమ్యూనరేషన్‌ ఇవ్వాలనే కండిషన్స్ పెడుతూ దర్శకనిర్మాతలను బెదరగొడుతుందట. ఇలాంటి కండిషన్స్ బోయపాటి సినిమాల్లో నడుస్తాయి కానీ.... మిగతా వారి సినిమాల్లో కష్టమే లేడి సూపర్ స్టార్ గారు. అయితే విజయశాంతి కండిషన్స్ తో దర్శకనిర్మాతలు ఆలోచనలో పడి అన్ని సినిమాలో కీలక పాత్రలు క్రియేట్‌ చేయటం కష్టమని భావిస్తున్నారని ఫిలింనగర్ టాక్.

Vijayashanthi Conditions for Acting in Movies:

Vijayashanthi decision on Acting in Movies
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs