Advertisement
Google Ads BL

‘లిప్ లాక్స్’పై రౌడీ రియాక్షన్ ఇదే!


మొన్నీమధ్యనే లిప్ లాక్స్ అనుభవాన్ని ఏకరువు పెట్టిన పూజా హెగ్డే తర్వాత... ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో కూడా లిప్ లాక్ సీన్స్ లో నటించాలంటే కష్టమే కానీ.. అది మా వృత్తి అని అంటున్నాడు. అతనెవరో కాదు అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ. మరి లిప్ లాక్ లేనిదే తన సినిమాలే ఉండవు. అలాంటి హీరో లిప్ లాక్స్ లో గల ఇబ్బందులను చెబుతున్నాడు. అర్జున్ రెడ్డి దగ్గర నుండి గీత గోవిందం, నిన్నగాక మొన్నొచ్చిన డియర్ కామ్రేడ్ లోను విజయ్ లిప్ లాక్ స్పెషల్ అట్రాక్షన్స్ గా నిలిచింది. అయితే విజయ్ దేవరకొండ చెన్నైలో జరిగిన ఓ అవార్డు వేడుకలో పాల్గొనడానికి వెళ్లగా అక్కడ స్టేజ్ దగ్గర విజయ్ ని చూడగానే చాలామంది అభిమానులు విజయ్ దేవరకొండ అంటూ అరవడం చూసిన వారు అవాక్కయ్యారట. మరి తెలుగులో అంటే విజయ్ దేవరకొండ క్రేజ్ వేరు.. కానీ తమిళనాట ఈ రేంజ్ క్రేజ్ అంటే మామూలు విషయం కాదు.

Advertisement
CJ Advs

ఇక విజయ్‌ని తమిళ నటుల్లో ఎవరితో కలిసి నటించాలని ఉందని అడగగా... ధనుష్ నటన అంటే ఇష్టమని, సూర్య, కార్తీ సినిమాల్లో కలిసి నటించాలని ఉందని చెప్పడమే కాదు.. రజినీకాంత్, అజిత్, విజయ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించాలని ఉన్నప్పటికీ.. వాళ్ళ సినిమాల్లో చిన్న పాత్రలతోనే సర్దుకుపోవాలని అది తనకి ఇష్టం లేదని చెబుతున్నాడు ఈ అర్జున్ రెడ్డి. ఇక రష్మికలా తాను తమిళం బాగా మాట్లాడలేనని చెప్పడం...  ముద్దు సీన్స్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా అందరిముందు తనకి ముద్దు సీన్స్ లో నటించాలంటే కాస్త ఇబ్బంది అని.. కానీ తప్పదుగా అది మా వృత్తి అని చెబుతున్నాడు. అన్నట్టు విజయ్ దేవరకొండ తాజా చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్ లోను విజయ్ దేవరకొండ లీప్ లాక్ సీన్ ఉందండోయ్. అది ఆ సినిమా టీజర్ లోనే చూపించేసి సినిమాపై క్రేజ్ పెంచే ఏర్పాట్లు చేస్తున్నారు. 

Vijay Deverakonda Talks About Lip-locks :

Lip-locks: That is my Profession says Vijay Deverakonda
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs