ఇదేంటి మొన్నేగా ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) డైరీ ఆవిష్కరణలో రచ్చ రచ్చ అయ్యింది.. స్టేజ్‌పైనే మీడియా, సీనియర్ నటీనటుల మధ్యే మెగాస్టార్ చిరంజీవి వర్సెస్ రాజశేఖర్ అన్నంతగా పరిస్థితులు ఏర్పాడ్డాయ్. ఆ తర్వాత చిరు కోపగించుకోవడం.. రాజశేఖర్ హర్టయ్యి వెళ్లిపోవడం.. స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలని చిరు కోరడం.. ముందే రాజశేఖర్ తన పదవికి రాజీనామా చేయడం జరిగిపోయాయ్.. కదా మళ్లీ ఈ ఫోన్లేంటి..? అనే సందేహం కలుగుతోంది కదూ.. అవును ఫోన్ చేసిన మాట వాస్తవమే కానీ.. అసలు చిరు ఎందుకు కాల్ చేశారు..? ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాళ్లెందుకు లిఫ్ట్ చేయలేదు..? అసలు ఫోన్ చేసిన వ్యవహారాన్ని ఎవరు బయటపెట్టారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే మరి.
కంటిన్యూగా కాల్ చేస్తే లిఫ్ట్ చేయలే!!
సీనియర్ హీరోయిన్ పూజితను ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. తెలుగు,తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సుమారు 138 చిత్రాల్లో నటించి మెప్పించిన ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘మా’ డైరీ ఆవిష్కరణలో జరిగిన గొడవ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ‘మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేద్దామని చిరంజీవి, క్రిష్ణంరాజు జీవితా రాజశేఖర్‌కి కంటిన్యూగా రోజంతా కాల్ చేస్తే వాళ్లు లిఫ్ట్ చేయలేదు. ఫోన్ ఆపేశారు. వాస్తవానికి ఆ రోజే ఈవెంట్‌ను ఆపేద్దామని వాళ్లిద్దరూ భావించారు. కానీ ఎలాగో ఫైనల్‌గా కార్యక్రమం అయితే జరిగింది. అలా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం తప్పు కాదా..? ఎప్పుడూ ఎవరితోనూ పెద్దగా మాట్లాడని చిరంజీవి లాంటి పెద్ద మనిషి వ్యక్తి.. నేను మాట్లాడాలని అన్నారంటే.. అంత వరకూ తెచ్చుకోవడం ఎందుకు..?’ అని లోలోపల జరిగిన రహస్యాలను పూజిత బయటపెట్టారు.
అంతా ఫేక్ అంతే..!
అంతటితో ఆగని పూజిత ఇంకొన్ని విషయాలు బయటపెట్టారు. ‘కాస్త క్లారిటీగా గమనిస్తే.. డైరీ ఆవిష్కరణలో చిరుకు జీవిత, రాజశేఖర్ వెల్‌కమ్ పలకడం, రిసీవింగ్ చేసుకున్నదంతా ఫేక్.. ఆ క్లిప్పింగ్స్‌ను బట్టి చూస్తే పైకి మాత్రమే అలా కనిపించారని.. లోలోపల మొత్తం వేరు మీరు మొన్న జరిగిన ఈవెంట్ క్లిప్పింగ్స్ చూస్తే.. జీవితరాజశేఖర్‌లు కావాలనే చేసినట్టు కనిపిస్తుంది. వాళ్లు ఇన్ని రోజులుగా అవకాశం వాళ్లు ఎదురుచూశారు. వాళ్ల నవ్వు, వాళ్ల రిసీవింగ్ అంతా ఫేక్. జీవిత రాజశేఖర్ వెనుక శివాజీ రాజా ఉన్నారు. మున్ముంథు ఏమవుతుందో చూద్దాం’ అని షాకింగ్ విషయాలనే పూజిత ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మరి ఇందులో నిజానిజాలంతో.. తెలియాలంటే జీవిత మీడియా ముందుకు రావాల్సిందే.