Advertisement
Google Ads BL

శ్రీదేవి మరణం వెనుక షాకింగ్ నిజాలివీ!!


అతిలోక సుందరి శ్రీదేవి తిరిగిరాని లోకాలకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈమె మరణానికి ఎన్నెన్నో కారణాలు చెప్పినప్పటికీ ఇప్పటికీ అసలు విషయం మాత్రం తెలియరాలేదు. ప్రెష్ అవుదామని వాష్‌రూమ్‌కు వెళ్లిన శ్రీదేవి పావుగంటైనా బయటకు రాకపోవడం.. భర్త బోనీకపూర్ వాష్‌రూమ్ వద్దకు వెళ్లి తలుపులు బద్దలు కొట్టడంతో అప్పటికే శ్రీదేవి బాత్‌టబ్‌లో అచేతనంగా పడి ఉండడం ఈ ఘటనతో బోనీ షాక్‌కు గురికావడం.. ఆ తర్వాత ఎన్నో ట్విస్ట్‌లు మధ్య ఆమె భౌతికకాయన్ని స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె మరణవార్తతో సినీ ఇండస్ట్రీ, శ్రేయోభిలాషులు శోకసంద్రంలో మునిగారు.

Advertisement
CJ Advs

అయితే అప్పట్లో ఆమె మృతికి గుండెపోటే కారణమని అప్పట్లో అందరూ అనడం.. బోనీ నోటి నుంచి కూడా ఇదే రావడంతో ఏదో దాస్తున్నారని అప్పట్లో అందరికీ అనుమానాలు తలెత్తాయి. ఆమె మరణాంతరం సత్యార్థ్ నాయక్ అనే ప్రముఖ రచయిత శ్రీదేవి బయోగ్రఫీ రాశారు. అందులో సంచలన విషయాలు బయటపెట్టారు.

నాగ్ చెప్పిన నిజమిదీ..!

‘శ్రీదేవికి రక్తపోటు సమస్య ఉంది. ఈ విషయాన్ని దర్శకుడు పరాషర్, నాగార్జున నాతో చెప్పారు. గతంలో మాతో షూటింగ్‌ పాల్గొన్నప్పుడు కూడా ఆమె బాత్రూమ్‌లో కళ్లు తిరిగిపడిపోయారు’ అని తనకు చెప్పారని రచయిత తన బయోగ్రఫీలో రాసుకొచ్చారు.

మేనకోడలు, బోనీ ఏం చెప్పారు!?

అయితే ఇందులో నిజమెంతో తెలుసుకోవడానికి శ్రీదేవి కుటుంబ సభ్యులు, సన్నిహితులను కూడా అడిగానన్నారు. ‘ ఒకసారి శ్రీదేవి బాత్‌రూమ్‌లో పడిపోయారు. వెళ్లి చూస్తే ఆమె ముఖానికి గాయాలయ్యాయి. ముఖం నిండా రక్తం కారిందని శ్రీదేవి మేనకోడలు మహేశ్వరి చెప్పింది. ఆ తర్వాత బోనీ కపూర్‌ను కూడా ఈ విషయై అడగ్గా.. నేను- శ్రీదేవి వాకింగ్‌కు వెళ్తుండగా.. పలుమార్లు ఆమె కుప్పకూలింది’ అని రచయిత సత్యార్థ్ నాయక్ తన బయోగ్రఫీలో రాశారు. మరి ఇందులో నిజానిజాలెంతో పైనున్న పెరుమాళ్లకే తెలియాలి.

Shocking Facts Behind Sridevi Death!!:

Shocking Facts Behind Sridevi Death!!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs