జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఇప్పటికే పలుమార్లు సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ తాజాగా మరోసారి ధ్వజమెత్తారు. వాస్తవానికి ఇప్పటి వరకూ ఆయన చేసిన విమర్శలకు గానూ ఏమేం కోల్పోయారో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఆయనకు జరగాల్సిన నష్టం అటు సినిమాల్లో.. ఇటు రాజకీయాల్లో జరిగిపోయింది.. ఇందుకు చక్కటి ఉదాహరణే మునుపటిలాగా ఆయన నోరెత్తి ఇష్టానుసారం మాట్లాడకపోవడమే.. అయితే ఏం జరిగింది..? ఈ తతంగం వెనుక వ్యవహారమేంటి..? అనే విషయాలు ఇక్కడ అనవసరం.. అసందర్భం కూడా.!
ఇక అసలు విషయానికొస్తే.. ఏపీలో రాజధాని తరలింపుపై పెద్ద ఎత్తున అమరావతి గ్రామాల రైతులు, టీడీపీ, వామపక్షాల నేతలు, ప్రజా సంఘాలు ధర్నాలు, ర్యాలీలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇదివరకే జనసేన అండ్ టీమ్ వెళ్లి రాజధాని రైతులకు అండగా ఉంటామని మాటివ్వడం.. ఆందోళనలో పాల్గొనడం జరిగింది. దీన్ని ఉద్దేశించి పృథ్వీ తాజాగా మీడియా ముందుకొచ్చి మరోసారి హాట్ హాట్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచారు. ‘అమరావతిలో రైతుల పేరుతో ఓ కార్పొరేట్ ఉద్యమం నడుస్తోంది. పవన్ కళ్యాణ్‌కు అమరావతిలో జరుగుతున్న ఈ అంశాలు కనిపించడం లేదా?’ అని ప్రశ్నించారు.
అంతటితో ఆగని ఆయన.. రాజధాని రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. రైతుల పేరుతో ధర్నాలు చేస్తున్న వారంతా పెయిడ్ ఆర్టిస్టులేనని వ్యాఖ్యానించారు. ఒకవేళ వాల్లు నిజంగా రైతులే అయితే వారి దగ్గర ఆడీ కార్లు, బంగారు గాజులు ఎలా వస్తాయ్..? అని ప్రశ్నించారు. ఇలాంటి వన్నీ పవన్‌కు కనిపించట్లేదా..? అని జనసేనానిని ప్రశ్నించారు. మొత్తానికి చూస్తే.. పవన్‌ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను.. విమర్శించి తీరుతానని పృథ్వీ పనిగానే పెట్టుకున్నాడని దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. మరి జనసైనికులు, మెగాభిమానుల నుంచి రియాక్షన్‌కు కూడా పృథ్వీ సిద్ధమవ్వాల్సిందేగా..!