Advertisement
Google Ads BL

ఓ చిన్న న‌వ్వే చాలంటున్న ఎంతో మంచివాడు!


‘ఓ చిన్న న‌వ్వే చాలు ప‌దా ప‌ల‌క‌రిద్దాం...’ అంటున్న ‘ఎంత మంచివాడ‌వురా’

Advertisement
CJ Advs

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో న‌టిస్తోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఎంత మంచివాడ‌వురా’. ‘శతమానం భవతి’ చిత్రంతో జాతీయ పురస్కారాన్ని గెలుచుకున్న సతీష్‌ వేగేశ్న ద‌ర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్యా మ్యూజిక్‌ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగి ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శ్రీదేవి మూవీస్ శివ‌లెంక కృష్ణప్రసాద్ స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

జాతీయ అవార్డ్ గ్ర‌హీత మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీసుంద‌ర్ సంగీత సారథ్యం వ‌హిస్తోన్న ఈ సినిమాలో మూడో పాట‌ను చిత్ర యూనిట్ రేడియో మిర్చిలో శుక్ర‌వారం విడుద‌ల చేసింది. ఈ కార్య‌క్ర‌మంలో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, డైరెక్ట‌ర్ స‌తీశ్ వేగేశ్న‌, పాట‌ల ర‌చ‌యిత రామ‌జోగ‌య్య శాస్త్రి పాల్గొన్నారు.

‘‘ఓ చిన్న న‌వ్వే చాలు ప‌దా ప‌ల‌క‌రిద్దాం

ఓ చిన్న మాటే చాలు.. బంధాల‌ల్లుకుందాం

ఏ ఊరు మీదే పేరు.. అడిగి తెలుసుకుందాం

ఎవ‌రైనా మ‌న‌వారేగా.. వ‌ర‌స క‌లుపుకుందాం.....’’

అంటూ కూల్‌గా ఈ పాట ఉంది. మ‌నుషుల మ‌ధ్య బంధాలను నిలుపుకోవాల‌ని, కాబ‌ట్టి ప్ర‌తి ఒక్క‌రితో క‌లిసిపోవాల‌ని అర్థం చెప్పేలా పాట ఉంది. 

పెళ్లి సంద‌ర్భంలో వ‌చ్చే ఈ పాట‌ను రామ‌జోగ‌య్య శాస్త్రి రాయ‌గా.. అనురాగ్ కుల‌క‌ర్ణి, గీతా మాధురి పాడారు. 

ప్ర‌స్తుతం ఈ సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 15న విడుల చేస్తున్నారు. 

న‌టీన‌టులు:

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, మెహ‌రీన్‌, వి.కె.న‌రేశ్‌, సుహాసిని, శరత్‌బాబు, త‌నికెళ్ల భ‌ర‌ణి, ప‌విత్రా లోకేశ్‌, రాజీవ్ క‌న‌కాల‌, వెన్నెల కిశోర్‌, ప్ర‌వీణ్‌, ప్ర‌భాస్ శ్రీను త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:

రచన, ద‌ర్శ‌క‌త్వం: స‌తీశ్ వేగేశ్న‌

నిర్మాణం: ఆదిత్య మ్యూజిక్‌  (ఇండియా ) ప్రైవేట్‌ లిమిటెడ్‌

నిర్మాతలు ‌:  ఉమేష్‌ గుప్తా, సుభాష్ గుప్తా

సమర్పణ :శివలెంక కృష్ణ ప్రసాద్

సినిమాటోగ్ర‌ఫీ:  రాజ్ తోట‌

సంగీతం:  గోపీ సుంద‌ర్‌

ఎడిటింగ్‌:

త‌మ్మిరాజు

ఆర్ట్‌:  రామాంజ‌నేయులు

ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌: ర‌షీద్ ఖాన్

Entha Manchivaadavuraa 3rd Song Launched:

Entha Manchivaadavuraa Movie O Chinna Navve Chalu song Released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs