Advertisement
Google Ads BL

ఉపేంద్ర ‘కబ్జా’ ప్రారంభమైంది


ఓం, ఎ, రా, చిత్రాలతో సెన్షేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చి అభిమానుల్లో, ప్రేక్షకుల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర.. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రంలో పవర్ ఫుల్ క్యారెక్టర్ చేసి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘కబ్జా’. 1947-80ల మధ్య అండర్ వరల్డ్ డాన్ కథాంశంతో తెరకెక్కుతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఇది. శ్రీ సిద్దేశ్వర ఎంటర్ ప్రైజెస్ పతాకంపై లగడపాటి శ్రీధర్ సమర్పణలో ఆర్.చంద్రు దర్శకుడిగా ఆర్.చంద్రశేఖర్, రాజ్ ప్రభాకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం జనవరి 4న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. పూజాకార్యక్రమాల అనంతరం ఉపేంద్రపై చిత్రీకరించిన ముహూర్తుపు సన్నివేశానికి రమేష్ ప్రసాద్ క్లాప్ నివ్వగా, ఆనంద్ గురూజీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సన్నివేశానికి బి.గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటైన సమావేశంలో హీరో ఉపేంద్ర, దర్శకుడు ఆర్.చంద్రు, సమర్పకుడు లగడపాటి శ్రీధర్, నిర్మాతలు ఆర్.చంద్రశేఖర్, రాజ్ ప్రభాకర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మునేంద్ర కె.పుర, కో-ప్రొడ్యూసర్స్ గోనుగుంట్ల శ్రీనివాస్, ఆర్.రాజశేఖర్, ఆనంద్ గురూజీ, హెచ్ యం, రేవన్న, ఫైట్ మాస్టర్ రవి వర్మ తదితరులు పాల్గొన్నారు. ఇదే వేదికపై కబ్జా మోషన్ పోస్టర్‌ని లగడపాటి శ్రీధర్ లాంచ్ చేశారు.

Advertisement
CJ Advs

దర్శకుడు ఆర్. చంద్రు మాట్లాడుతూ... బ్రహ్మ, ఐ లవ్ యు తరువాత ఉపేంద్ర గారితో ఈ సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. 1947-80లలో జరిగిన అండర్ వరల్డ్ డాన్ కథ ఇది. డిఫరెంట్ స్టయిల్ లో పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మాస్ హిట్ చెయ్యాలని కసితో వర్క్ చేస్తున్నాం. శ్రీధర్ గారి బ్యానర్ లో కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని సినిమా తర్వాత తెలుగులో చేస్తున్న రెండో చిత్రం ఇది. నా బ్రదర్ శ్రీధర్ గారు ఈ చిత్రానికి తన సపోర్ట్ అందిస్తున్నందుకు థాంక్స్.. అన్నారు.

చిత్ర సమర్పకుడు లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ.. నేను కన్నడలో చదువుకున్నాను. ఉపేంద్ర గారి ఓం సినిమా నా ఆల్ టైం పేవరేట్ మూవీ. ఎ, రా, వంటి మంచి హిట్స్ ఇచ్చారు. చంద్రు వెరీ టాలెంటెడ్ డైరెక్టర్. ఆయనతో కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని సినిమా చేశాను. ఆ చిత్రం జైపూర్ ఫిల్మ్ ఫెస్టివల్ కి ఎంపికై అవార్డు లభించింది. కబ్జా కథ వినగానే నాకు బాగా నచ్చింది. ఈ చిత్రానికి వన్ ఆఫ్ ది పార్ట్ అయినందుకు హ్యాపీగా ఉంది. చంద్రు, ఉపేంద్ర కాంబినేషన్లో వచ్చిన బ్రహ్మ, ఐ లవ్ యు చిత్రాలకంటే కబ్జా పెద్ద హిట్ అవుతుంది. అండర్ వరల్డ్ డాన్ కథాంశంతో యాక్షన్ని జోడించి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఓం స్థాయికి ఏమాత్రం తగ్గకుండా భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందిస్తున్నాం. తప్పకుండా ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుంది. ఈ సినిమా తర్వాత ఉపేంద్రతో చాలా మంది కొత్త కథలు రాస్తారు. ఆయన ఇంకా మరిన్ని తెలుగు స్ట్రెయిట్ చిత్రాలు చెయ్యాలి.. అన్నారు.

రియల్ స్టార్ ఉపేంద్ర మాట్లాడుతూ.. ఎ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. అప్పట్నుంచి సన్నాఫ్ సత్యమూర్తి వరకు నన్ను వారు అభిమానిస్తూనే వున్నారు. కబ్జా ఒక అండర్ వరల్డ్ డాన్ కథ. చాలా కొత్త జోనర్లో పాన్ ఇండియా స్థాయిలో చెయ్యాలని టీమ్ అంతా ప్లాన్ చేశాం. అప్పట్లో ఓం చిత్రాన్ని ఎక్స్ పెరిమెంట్ చేశాం. అలాగే ఓ కొత్త జోనర్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చంద్రు ఎప్పుడూ పాజిటివ్ గా ఉంటాడు. అతనితో చేసిన రెండు సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. మా కాంబినేషన్లో వస్తోన్న ఈ చిత్రం కూడా ప్రేక్షకుల హృదయాలను కబ్జా చేస్తుంది..అన్నారు.

నిర్మాత రాజ్ ప్రభాకర్ మాట్లాడుతూ.. 10 ఇయర్స్ నుండి సినిమా తీయాలని ప్రయత్నిస్తున్నాను. చంద్రు చెప్పిన సబ్జెక్ట్ నచ్చి భారీ బడ్జెట్ తో ఈ సినిమా తీస్తున్నాం. ఉపేంద్ర లాంటి రియల్ స్టార్ తో కబ్జా మూవీ చేయడం చాలా హ్యాపీగా ఉంది.. అన్నారు.

మరో నిర్మాత గోనుగుంట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఉపేంద్ర గారికి సెపరేట్ అభిమానులున్నారు. కన్నడలోనే కాకుండా ఇండియా లెవెల్ లో ఆయనకి ప్రత్యేక ఫాన్ ఫాలోయింగ్ ఉంది. ది బెస్ట్ విజువల్ ఫీస్ట్ గా కబ్జా చిత్రం ఉండబోతుంది. ఈ చిత్రాన్ని నిర్మించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది.. అన్నారు.

Hero Upendra’s Kabza Movie Launched:

Upendra’s Kabza Movie Opening Details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs