Advertisement
Google Ads BL

నాగబాబు లేకపోతేనేం.. రోజా ఇరగేస్తుందిగా!


పండగ స్పెషల్ అంటూ ఈటీవీ ఎప్పుడు ఏదో ఒక ప్రోగ్రాంని చేసి పండగ రోజు ఉదయం తొమ్మిదిగంటలకు ప్రసారం చేస్తుంటుంది. గతంలో ఇలానే సుధీర్ - రష్మీల పెళ్లి గోల అంటూ ఈటీవీలో ప్రసారం అయిన సుధీర్ గాడి పెళ్లి అనే ప్రోగ్రాం టాప్ వన్ లో నిలిచింది. తాజాగా కమెడియన్స్, సింగర్స్, డాన్స్ మాస్టర్స్ ఇలా అందరూ ఓ చోట చేరి ఆడవారి పార్టీలకు అర్ధాలే వేరులే అంటూ జనవరి 1న న్యూ ఇయర్ స్పెషల్ ప్రోగ్రాం చేశారు. ఆ ప్రోగ్రాం జనవరి 1 ఈటీవీలో ఉదయం 9 గంటలకు ప్రసారం అయ్యింది. ఆ షో లో హాట్ యాంకర్ వర్షిణి, హైపర్ ఆది యాంకరింగ్స్ చెయ్యగా.. సుధీర్, శ్రీను, రామ్ ప్రసాద లాంటి వాళ్ళు కామెడీతోనూ, జాఫర్ స్పెషల్ ఇంటర్వ్యూతోనూ, సింగర్స్ టాప్ సాంగ్స్ తోనూ, జానీ మాస్టర్ అదరగొట్టే డాన్స్ తోనూ అదరగొట్టేసాడు. ప్రోమోస్ తోనే ఈ షోపై ఇంట్రెస్ట్ పెంచిన ఈటీవీ ఆ ప్రోగ్రాంతో ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండింగులోకొచ్చేసింది.

Advertisement
CJ Advs

నాగబాబు లేకపోయినా రోజా లీడర్ షిప్ లో ఈ ప్రోగ్రాం నిజంగా అదిరింది. ఫ్యామిలీ అంతా చూడదగ్గ ప్రోగ్రాంగా ఈ ఆడవారి పార్టీలకు ఆర్ధాలే వేరులే ఉంది. రోజా ఆధ్వర్యంలో రెండు గ్రూపులుగా ఉండి.. న్యూ ఇయర్ సందర్భంగా చేసిన హంగామా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. అందుకు తగ్గట్టుగానే ఆడియన్స్ నుంచి ఈ ప్రోగ్రామ్‌కు మంచి స్పందనే వచ్చింది. యూట్యూబ్‌లో ఈ ప్రోగ్రామ్‌ను అప్‌లోడ్ చేస్తే... ఒక్కరోజులోనే యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో 2nd ప్లేస్‌లోకి వచ్చేసింది. మరి మహేష్ సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సాంగ్స్ ని వెనక్కి నెట్టి ఈటీవీ ఆడవారి పార్టీలకు అర్ధాలే వేరులే ప్రోగ్రాం ట్రేండింగ్ లో టాప్ ప్లేస్ కి రావడం మాత్రం నిజంగా సూపర్. మరి మహేష్, అల్లు అర్జున్, ఈ స్పెషల్ ప్రోగ్రామ్స్ యూట్యూబ్ లో అటు ఇటుగా టాప్ ప్లేస్ లో ఉన్నాయి. 

ETV New Year Special Program Trending in Top Place:

No Nagababu.. Roja Takes All Credit
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs