Advertisement
Google Ads BL

‘రా’ ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలారు


కార్తిక్ క్రియేషన్స్ సమర్పణలో రాజ్ డొక్కర దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం ‘RAW’ (రా). శ్రీనివాస్, ఇర్ఫాన్, చంటి, మనోహర్, లోహితలు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ మరియు పోస్టర్ లాంచ్ ను నూతన సంవత్సరం సందర్బంగా విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ కార్యక్రమానికి దర్శకుడు త్రినాధ్ నక్కిన, జబర్దస్త్ అవినాష్, సతీష్ బోట్ల ముఖ్య అతిధులుగా పాల్గొని RAW (రా) పోస్టర్ ను విడుదల చేశారు.

Advertisement
CJ Advs

అనంతరం త్రినాధ్ నక్కిన మాట్లాడుతూ.. RAW (రా) అనే టైటిల్ ను చూడగానే కొత్తగా అనిపించింది. అలానే పోస్టర్ లో కూడా కొత్తదనం కనపడుతోంది. సినిమాలో ఏదైనా విషయం ఉంటేనే వర్కౌట్ అవుతాయి దానికి బెస్ట్ కంటెంట్ చెప్పుకుంటే హారర్ కామెడీ లేదా లవ్ స్టోరీ  ఉండాలి అవే ఈ RAW (రా) సినిమాలో ఉన్నాయని అర్థమవుతోంది. డైరెక్షన్, ప్రొడక్షన్ చేయడం చాలా కష్టమైన పని. ఈ రెంటిని బ్యాలన్స్ చేయడమంటే సాధారణమైన విషయం కాదు. అలాంటి బాధ్యతను తీసుకున్న రాజ్ డొక్కర నిజంగా గ్రేట్ అని చెప్పాలి. టీమ్ అందరిదీ వైజాగ్ అని అర్థమవుతోంది. షూటింగ్ కూడా ఆ పరిసర ప్రాంతాల్లోనే చేశారని చెబుతున్నారు. అక్కడ అన్నీ సౌకర్యాలు ఉండడంతో ఇటీవల అందరూ వైజాగ్ లోనే షూట్ చేస్తున్నారు. మెచ్చుకోదగ్గ విషయమే.. ఇక ఈ సినిమాను చాలా ఫ్యాషనేట్ తో తీశారు. పెద్ద సక్సెస్ అందుకోవాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నారు.

దర్శకుడు, నిర్మాత రాజ్ డొక్కర మాట్లాడుతూ.. RAW (రా) సినిమాను ఒక ట్రూ స్టోరీని బేస్ చేసుకొని చేసిన సినిమా. మా సినిమాలో RAW( రా) అంటే ఏంటి అనేది ఇంటర్వెల్ లో అబ్రివేషన్ తో పాటు రివీల్ చేయడం జరుగుతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్. ఇందులో డ్రంక్ అండ్ డ్రైవ్ మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. రెండు పాటలు, రెండు ఫైట్స్ మిగిలి ఉన్నాయి. త్వరలో అవికూడా పూర్తి చేసి ఏప్రిల్ నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఇక మా టీమ్ అందరూ ఎంతో ఇష్టంతో కష్టపడి పనిచేశారు. 25 డేస్ లో సినిమా షూటింగ్  పూర్తి చేయగలిగాము అంటే అది వీరిచ్చిన సపోర్ట్ కారణం అని తెలిపారు.

హీరోయిన్ లోహిత మాట్లాడుతూ.. నాలో ఇంత టాలెంట్ ఉందని నాకే తెలియదు. డైరెక్టర్ గారు చాలా ఎంకరేజే చేశారు. థ్రిల్లర్ జోనర్. సినిమా చాలా బాగొచ్చింది. అందరం చాలా కష్టపడి పనిచేశాము మీకు కూడా మా సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాను అని చెప్పారు.

హీరో మనోహర్ మాట్లాడుతూ.. RAW (రా) అంటే ఫుల్ ఫార్మ్ ఏంటి అనేది సినిమాలోనే చెబుతాము. ఆర్టిస్టులతో కలసిపోయి టెక్నీషియన్స్ వర్క్ చేశారు. ఈ సినిమాలో ఒక పాప ఉంది. ఆ పాప పాత్రే ఈ సినిమాకు వెన్నెముక. సినిమా చాలా బాగుంటుంది. మమ్మల్ని ఆదరించండని అన్నారు.

హీరో చంటి మాట్లాడుతూ.. త్రినాధ్ నక్కిన గారు మా కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఇచ్చే ప్రోత్సాహం వల్లే నేను ఇప్పుడు ఇక్కడున్నాను. అందుకు ఆయనకు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. మా సినిమాలో ప్రతి సీన్ ఆకట్టుకునేలా ఉంటుంది. చాలా ఇష్టంతో ఈజీగా వర్క్  చేసాము. టీమ్ సపోర్ట్ చాలా బాగుందని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో ఇర్ఫాన్, స్వీటీ, ఆజాద్ ఖాన్, సూర్యలతో పాటు తదితరులు పాల్గొని తమ అభినందనలు తెలియచేసారు.

చంటి, మనోహర్, లోహిత, ఇర్ఫాన్, స్వీటీ, ఆజాద్ ఖాన్, సూర్య, వినోద్, హాడీ, నయీమ్, శ్రీనివాస్ ప్రధాన ప్రాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథ- స్క్రీన్ ప్లే- మాటలు- దర్శకత్వం: రాజ్ డొక్కర, కెమెరా: రాజేష్ భూపతి, కో డైరెక్టర్: సురేష్ వాన పిల్లి, మ్యూజిక్: కె. వేద, లిరిక్స్: రామాంజనేయులు, మేకప్: గణేష్,  స్టంట్స్: రాజేష్, కొరియోగ్రఫీ: గణేష్ స్వామి, ప్రొడక్షన్:  పి. సంతోష్ కుమార్, వెంకీ (పార్వతి పురం). ఆర్ట్: రాఘవ, అఖిల్.

Raw Movie First Look Poster Release:

Trinadharao Nakkina Launches Raw Movie First Look Poster
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs