Advertisement
Google Ads BL

‘చీమ - ప్రేమ మధ్యలో భామ’ రిలీజ్‌కు రెడీ!


జనవరి ఎండింగ్ లో ‘చీమ - ప్రేమ మధ్యలో భామ’ రిలీజుకు సిద్ధం.

Advertisement
CJ Advs

‘చీమ - ప్రేమ మధ్యలో భామ!’ కు సెన్సార్ బోర్డు ‘U/A’ సర్టిఫికెట్ ఇచ్చిన సందర్భంగా  సినిమా దర్శకుడు శ్రీకాంత్ ‘శ్రీ’ అప్పలరాజు ‘చీమ హీరో కదాని చిన్న పిల్లలకు ఈ సినిమా ప్రత్యేకం అని చెప్పలేము - అంతకుమించి!. అపుడెపుడో ముళ్ళపూడి గారు చెప్పారు - సృష్టిలో స్త్రీ, పురుషులు సమానం ! కాకపోతే పురుషులు కొంచెం ఎక్కువ సమానం - అని! అలాగే ఈ సినిమా అందరి కోసం! కాకపోతే  కొంచెం ఎక్కువ స్త్రీల కోసం (ladies special) ! అవునో, కాదో ప్రేక్షకులే నిర్ణయిస్తారు త్వరలో!’ అని అన్నారు.

ఈ సందర్భంగా  నిర్మాత లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... ‘‘చీమ - ప్రేమ మధ్యలో భామ’’ సినిమాను ఎటువంటి సెన్సార్ కట్స్ లేకుండా యథాతథంగా రిలీజుకు అనుమతి పొందడం మా సంస్థ మాగ్నమ్ ఓపస్ నిబద్ధతకు ఒక నిదర్శనం. ప్రయత్నలోపం లేకుండా, విలువలకు ప్రధాన్యతనిస్తూ తీసిన విన్నూత్నమైన సినిమా ఇది’’ అని తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న మా చిత్రాన్ని జనవరి ఎండింగ్ లో రిలీజ్ చేయాటానికి సన్నాహాలు చేస్తున్నాం. అని అన్నారు.

మాగ్నమ్ ఓపస్  (Magnum Opus ) ఫిలిమ్స్ పతాకం పై శ్రీకాంత్ ‘శ్రీ’ అప్పలరాజు దర్శకత్వంలో ఎస్ ఎన్ లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న చిత్రం  ‘చీమ - ప్రేమ మధ్యలో భామ.’ అమిత్ మరియు ఇందు హీరో హీరోయిన్ గా నటించారు. 

నటీనటులు : అమిత్, ఇందు, సుమన్, హరిత, పురంధర్, వెంకట్ నిమ్మగడ్డ, రమ్య చౌదరి, బొమ్మ శ్రీధర్, రవి కిషోర్, కిషోర్ రెడ్డి, వెంకటేశ్ మరియు సురేష్ పెరుగు. సంగీతం: రవి వర్మ, సింగర్స్: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, గీతా మాధురి, సినిమాటోగ్రఫీ: ఆరిఫ్ లలాని, ఎడిటర్: హరి శంకర్, పి.ఆర్.ఓ: బి.వీరబాబు, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్: శ్రీకాంత్ ‘శ్రీ’ అప్పలరాజు, నిర్మాత: ఎస్ ఎన్ లక్ష్మీనారాయణ.

Cheema Prema Madhyalo Bhama Movie Ready to Release:

Cheema Prema Madhyalo Bhama Censor Completed 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs