Advertisement
Google Ads BL

రష్మిక మాజీ లవర్ సినిమా సంగతేంటి?


టాలీవుడ్ టాప్ చైర్ కి దగ్గరవుతున్న రష్మిక ఎంగేజ్మెంట్ ని బ్రేక్ చేసుకుని కెరీర్ కోసం తహతహలాడుతోంది. అయితే కన్నడ నుండి తెలుగులో దూసుకుపోతున్న రష్మికకి ఆమె మాజీ ప్రియుడు నిన్నటివరకు కాస్త టెన్షన్ పెట్టాడు. అతడే శ్రీమన్నారాయణ అంటూ కెజిఎఫ్ రేంజ్ హిట్ కోసం తెలుగులోకి దిగాడు రక్షిత్ శెట్టి. మధ్యలో రష్మిక క్రేజ్ వాడుకుందామని కూడా అనుకుని తన సినిమా ప్రమోషన్స్ లో రష్మిక ముచ్చట పదే పదే తెచ్చాడు. అయితే రక్షిత్ శెట్టి హీరోగా తెరకెక్కిన అతడే శ్రీమన్నారాయణ వీక్ ప్రమోషన్స్ తో న్యూ ఇయర్ రోజున తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. భారీ హైప్ మీదున్న సినిమాకి సరైన ప్రమోషన్స్ లేక భారీ ఓపెనింగ్స్ తెచ్చుకోలేకపోయింది. అయితే కెజిఎఫ్ లాంటి సినిమా వచ్చిన భాష నుండి వచ్చిన సినిమా కావడం, రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ సినిమా కావడంతో.. జనాల్లో కాస్త ఆసక్తి కనబడింది.

Advertisement
CJ Advs

కాకపోతే సినిమా నిడివి ఎక్కువవడం, కథలో చాలా లాజిక్స్ సాధారణ ప్రేక్షకుడికి అంతుబట్టవు. అలాగే సినిమా మొత్తం కన్నడ ఫ్లేవర్ తో ఉండడంతో తెలుగు ప్రేక్షకులకు అంతగా రుచించదు. అయితే సినిమాకి ప్రధాన బలం హీరో రక్షిత్ శెట్టి. రక్షిత్ శెట్టి ఎనర్జిటిక్ పోలీస్ అధికారిగా భిన్నమైన పాత్రలో జీవించారు. తెరపై ఆయన ప్రజెన్స్ మరియు మేనరిజం బాగా పేలాయి. ఇంకా మ్యూజిక్, కథనం, సినిమాటోగ్రఫీ అన్ని సినిమాకి ప్లస్ అయినప్పటికీ... మూడు గంటల నిడివితో ప్రేక్షకులకు అతడే శ్రీమన్నారాయణ పరిక్ష పెట్టిందనే చెప్పాలి. హీరో పాత్ర కామెడీకి కనెక్ట్ అయ్యింది కానీ.... హీరోయిజం మాత్రం పండలేదు. ఇక హీరోయిన్ శాన్వి నటన ఆకట్టుకున్నప్పటికీ... ఆమెకి నటించే స్కోప్ తక్కువగా ఉంది. మరి అతడే శ్రీమన్నారాయణతో రక్షిత్ శెట్టి సూపర్ ఛాన్స్ మిస్ చేసుకున్నాడనే చెప్పాలి.

Rashmika Ex boyfriend Failed at Tollywood Box Office:

Athade Srimannarayana Movie Report at Box Office
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs