Advertisement
Google Ads BL

మహేష్, ప్రభాస్ రూటులో వెళ్తున్న ‘రౌడీ’!


ప్రస్తుతం స్టార్ హీరోస్ మొత్తం సినిమాలనే కాకుండా ఇతర బిజినెస్ లతోను దూసుకుపోతున్నారు. విజయ్ దేవరకొండ అయితే రౌడీ బ్రాండ్స్ అంటూ కొత్త వ్యాపారం ఎప్పుడో మొదలెట్టాడు. మహేష్, ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి వాళ్ళు థియేటర్ బిజినెస్ అంటూ మల్టిప్లెక్స్ నిర్మాణంలో డబ్బు పెట్టుబడులు పెడుతున్నారు. మహేష్ AMB ఇప్పటికే క్లిక్ అవగా.. ప్రభాస్ మల్టీప్లెక్స్ నెల్లూరులో ఈ మధ్యనే ఓపెన్ అయ్యింది. అల్లు అర్జున్ మల్టిప్లెక్స్ అమీర్ పేట్ లో మొదలుకాబోతుంది. తాజాగా ఈ హీరోల సరసన రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేరబోతున్నాడు. తన క్రేజ్ తో థియేటర్ బిజినెస్ మొదలెట్టే యోచనలో ఉన్నాడట. ఇప్పటికే డైరెక్ట్ గా ధైర్యంగా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న విజయ్ ఇప్పుడు వ్యాపార పరంగాను స్టార్ హీరోలకు చెక్ పెట్టబోతున్నాడు.

Advertisement
CJ Advs

మహేష్ పార్టనర్.. ఏషియన్ సునీల్ తో కలిసి విజయ్ థియేటర్ రంగంలోకి అడుగుపెడుతున్నాడని అంటున్నారు. ఏషియన్ సినిమాస్‌తో కలిసి ఏవీడీ పేరుతో మహబూబ్ నగర్‌లో ఫస్ట్ మల్టీప్లెక్స్‌ను విజయ్ దేవరకొండ త్వరలో ఓపెన్ చేయబోతున్నాడు. మరి చాలా తక్కువ సమయంలో అగ్ర హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ కేవలం సినిమాలకే పరిమితం కాకుండా.. బిజినెస్ అంటూ దూకుడు చూపిస్తున్నాడు. మహేష్, ప్రభాస్ లాంటి హీరోలు కెరీర్ లో స్థిరపడ్డాక ఇలా బిజినెస్ లో డబ్బు పెట్టుబడిలో పెడితే... విజయ్ మాత్రం ఐదారు సినిమాలకే ఇలా బిజినెస్ అంటూ చూస్తుంటే తర్వాత విజయ్ ని పట్టుకోవడం కష్టమే.

Vijay Devarakonda Follows Mahesh Babu and Prabhas:

Vijay Devarakonda Entering Multiplex Business
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs