టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా హిట్ చిత్రాల దర్శకుడిగా పేరుగాంచిన అనీల్ రావిపూడి తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమాలో కామెడీతో పాటు యాక్షన్ కూడా అదిరిపోయేలా ఉండటంతో సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికేట్ ఇచ్చింది. ఇప్పటి వరకూ సినిమా నుంచి వచ్చిన లుక్స్, సాంగ్స్‌ను బట్టి చూస్తే మహేశ్ ఖాతాలో మరో సూపర్ డూపర్ పడటం ఖాయమని స్పష్టంగా తెలుస్తోంది.. భారీగానే అంచనాలున్నాయ్. కాగా.. ఈ నెల 05న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మెగా సూపర్ ఈవెంట్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి రానున్నారు.. అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఇప్పటికే స్టేడియంలో ఏర్పాట్లను పూర్తి చేసుకుంది చిత్రబృందం.
వాస్తవానికి సంక్రాంతికి రిలీజ్ అవుతున్న బన్నీ ‘అల వైకుంఠపురంలో..’ సినిమా ప్రమోషన్స్‌తో పోల్చుకుంటే ‘సరిలేరు..’ చాలా తక్కువేనని చెప్పుకోవచ్చు. అందుకే ఇప్పుడిప్పుడే ప్రమోషన్స్ జోరు పెంచి ఇంటర్వ్యూలు.. గట్రా ఇస్తూ హడావుడి చేస్తోంది. ఇవన్నీ కాకుండా మెగాస్టార్‌తో ప్రీ రిలీజ్ ఈవెంట్ పూర్తయిన రెండు లేదా మూడ్రోజుల గ్యాప్‌లో మరో ఈవెంట్ నిర్వహించాలని చిత్రబృందం యోచిస్తోందట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు ఫిల్మ్‌నగర్‌లో గట్టిగా వైరల్ అవుతున్నాయట.
ఈ రెండో ఈవెంట్‌కు ‘సరిలేరు.. స్పెషల్ ఈవెంట్’ అని పేరు కూడా అనుకున్నారట. ఈ ఈవెంట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నాడట. అంటే అటు సీనియర్ స్టార్ హీరో చిరంజీవి ఫస్ట్ ఈవెంట్‌కు.. రెండో ఈవెంట్‌కు జూనియర్ స్టార్ హీరో ఎన్టీఆర్ విచ్చేస్తారన్న మాట. ఇదే నిజమైతే ఎన్టీఆర్-మహేశ్ ఇద్దరూ రెండోసారి ఒకే స్టేజ్‌పై దర్శనమిస్తారన్న మాట. ఇప్పటికే ‘భరత్ అనే నేను’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు జూనియర్ హాజరై సందడి చేశాడు. మరి తాజా వ్యవహారంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.