Advertisement
Google Ads BL

‘థైస్ విత్ వర్మ’.. ఆర్జీవీ పిచ్చి పీక్స్!


 

Advertisement
CJ Advs

 

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌‌‌‌కు పబ్లిసిటీ పిచ్చి ఏ రేంజ్‌లో ఉందో అందరికీ తెలిసిందే. సినిమా ఉన్నా లేకున్నా సరే తన పేరు నలుగురి నోళ్లలో ఎలా నానాలో..? ఎవర్ని కెలకాలి..? ఎవరిపై విమర్శలు గుప్పించాలి..? అని ఆలోచిస్తుంటాడు ఆర్జీవీ. వివాదాస్పద సినిమా ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ తర్వాత ఒకట్రెండు సినిమాలు ప్రకటించిన ఆయన.. ఆ ఊసే ఎత్తలేదు కానీ.. తన శిష్యుడు అగస్త్య మంజు తెరకెక్కించిన ‘బ్యూటీఫుల్‌’ ప్రమోషన్‌లో మాత్రం మునిగితేలుతున్నాడు. ఇప్పటికే రకరకాల పేర్లతో చిత్ర విచిత్రాలుగా ఈవెంట్స్ నిర్వహించిన ఆర్జీవీ.. తాగి ఊగి నానా రచ్చ చేస్తూ ఆఖరికి హీరోయిన్ కాళ్లు కూడా పట్టుకుని హడావుడి చేశాడు. ఎన్ని చేసినా.. ఏం చేసినా సినిమా ప్రమోషన్ కోసమేనని ఆర్జీవీ చెప్పుకొస్తున్నాడు. 

 

అంతేకాదండోయ్.. ఇప్పటి వరకూ తన సొంత ఈవెంట్స్‌కు కూడా ఫ్యామిలీని పిలవని ఈయన.. సిస్టర్, మదర్‌ను రంగంలోకి దింపాడు. ఇక ఇవన్నీ అటుంచితే.. వోడ్కా విత్ వర్మ, డ్యాన్స్, హీరోయిన్‌ కాళ్లు పట్టుకున్న వ్యవహారం నుంచి ఫ్యాన్స్ తేరుకోక ముందే తాజాగా ‘థైస్ విత్ వర్మ’ అంటూ కొత్త హడావుడి మొదలుపెట్టేశాడు. ఇదిగో పక్కనుండే ఫొటోలో చూడండి పరిస్థితి ఏంటో మీకే అర్థమవుతుంది. ఈ థైస్ చూపిస్తున్న బ్యూటీ ‘బ్యూటిఫుల్’ సినిమా కాస్ట్యూమ్ డిజైనర్. హీరోయిన్‌ మొదలుకుని ఎవర్నీ వదిలే ప్రసక్తే లేదని ఇలా డిజైనర్‌ను ఒళ్లో కూర్చోబెట్టుకుని పరోక్షంగా చెబుతున్నాడన్న మాట. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు, ఫ్యాన్స్‌.. ఆర్జీవీని ఓ రేంజ్‌లో తిట్టిపోస్తున్నారు. వామ్మో.. వయసు 60కి చేరువవుతున్నా టీనేజీ, కామ భూతం బయటికి పోలేదు కద్రా బాబోయ్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘బ్యూటిఫుల్‌’ మూవీ కోసం ఇంత హడావుడి చేస్తున్న ఆర్జీవీ.. సినిమాను ఏ మాత్రం గట్టెక్కిస్తాడో వెయిట్ అండ్ సీ..!

News About RGV Promoting Beautiful Movie!:

News About RGV Promoting Beautiful Movie!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs