Advertisement
Google Ads BL

‘ఆగ్రహం’ ఆపుకోలేకే రిజైన్ చేశాడు


మా డైరీ ఆవిష్కరణ సభ రసాభాసగా ముగిసింది. ఆ మా డైరీ ప్రెస్ మీట్ లో ఎన్నో కొత్త కొంగొత్త విషయాలు, మరెన్నో కొత్త విభేదాలు తెర పైకి వచ్చాయి. మోహన్ బాబుని చిరు ప్రేమగా ఆలింగనం చేసుకుని ముద్దుపెట్టే సీన్ అందరిని ఆకట్టుకుంది. అలాగే మోహన్ బాబు ని పంచ్ లతో చిరు ఆడుకోవడం, ఇంకా రాజశేఖర్ మైక్ లాక్కుని ఆవేశంగా మాట్లాడడం, చిరంజీవి శివాజీరాజా, శ్రీకాంత్ వాళ్ళని సపోర్ట్ చేసారని, మా లో గొడవలు ఉంటే లేవని ఎలా చెబుతారంటూ.. ఫైర్ అవడం.. అక్కడనుండి వెళ్లిపోవడం.. అబ్బా ఈ ఎపిసోడ్ మొత్తం చాలా ఆసక్తిగా సాగింది. మధ్యలో జీవిత అందుకుని మా అయన చిన్నపిల్లాడు అని చెప్పడం, అలాగే భర్త తరుపున జీవిత క్షమాపణ చెప్పడం, అయినా చిరు, కృష్ణంరాజు అంతా కలిసి రాజశేఖర్‌ని పనిష్ చెయ్యాలంటూ తీర్మానం ప్రవేశ పెట్టడం వంటివి ‘మా’పై ఎన్ని డౌట్స్ రావాలో అన్ని డౌట్స్‌ని క్రియేట్ చేశాయి.

Advertisement
CJ Advs

ఇక ఇదంతా ఒక ఎత్తైతే.. తాజాగా రాజశేఖర్ మా ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చెయ్యడం మరో ఎత్తు. చిరు ఆగ్రహం, జీవిత క్షమాపణలు, అయినా రాజశేఖర్ కసి కోపం తీరక మా ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఓ లేఖని వదిలాడు. మరి జీవితేమో ఎన్ని విభేదాలున్నా మా అధ్యక్షుడు నరేష్ తోనే నడుస్తామని చెప్పడం, మరోపక్క రాజశేఖర్ రాజీనామా డ్రామా ఇదంతా ఓ సినిమాకి ఎక్కువ సీరియల్‌కి తక్కువ అన్న రేంజ్ లో మీడియా ముందే జరిగింది. ఇక అక్కడ జరిగిన మేటర్ ని మీడియా చిలవలు పలవలు అల్లే పనిలేకుండా యాజిటీజ్‌గా ప్రసారం చేస్తుంది.

Rajasekhar Resigns As Maa Vice President:

MAA War: Rajasekhar Resigns his post in Maa
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs