Advertisement
Google Ads BL

ఆ జోనర్ తప్ప ఏదైనా ఓకే: కీరవాణి కొడుకు


‘మత్తువదలరా’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన కీరవాణి కొడుకు... ఇంకా కీరవాణి కొడుకేమిటి.. హీరో శ్రీసింహ తన నెక్స్ట్ సినిమా ఎలా ఉండాలో చెబుతున్నాడు. అది కూడా బాహుబలి ప్రభాస్ తనని ఇంటర్వ్యూ చేస్తుంటే చెబుతున్నాడు. బాహుబలి తరువాత రాజమౌళి ఫ్యామిలీకి బాగా దగ్గరైన ప్రభాస్.. కీరవాణి కొడుకులు చేసిన మత్తువదలరా.. సినిమాని చూడడమే కాకుండా.. సినిమా హిట్ అంటూ పొగడడంతో పాటుగా... కీరవాణి కొడుకులు శ్రీసింహ, కాలభైరవ, దర్శకుడు రితేష్, నిర్మాత చెర్రీలతో ప్రభాస్ న్యూ ఇయర్ సందర్భంగా స్పెషల్ ఇంటర్వ్యూ చేసాడు. మరి మత్తువదలరా టీం తో స్పెషల్ ఇంటర్వ్యూ చేసిన ప్రభాస్ కి అందరూ ఫన్నీ సమాధానాలతో నవ్వించారు.

Advertisement
CJ Advs

ఇక సింహాని ప్రభాస్ నీ నెక్స్ట్ సినిమా ఎలాంటి కథతో చేస్తావంటే.... నాకు రొమాన్స్ జోనర్ తప్ప మిగతా ఏ జోనరైనా పర్లేదంటూ సమాధానం చెప్పగా... దానికి ప్రభాస్ నవ్వుతూ... రాజమౌళి కూడా మొదట్లో ఇలానే చెప్పాడు.. కానీ మగధీర చెయ్యలేదా అంటూ నవ్వేసాడు. ఇక గెడ్డం పెంచినప్పుడు నీ ఫీలింగ్ ఏమిటని సింహాని అడగగా... ఆ గెడ్డం పెంచడానికి ఆరు నెలలు కష్ట పడ్డా.. అప్పుడు ఇంట్లో అందరూ అఘోరాలా ఉన్నావని ఏడిపించేవారని చెప్పగానే ప్రభాస్ దానికి.. నాకూ బాహుబలి తర్వాత గెడ్డం అంటే చిరాకు పుట్టింది.. ఎప్పుడైనా రానా గెడ్డంతో కనబడితే షేవ్ చెయ్యి అంటుంటానని సరదాగా ఇంటర్వ్యూ ముగించాడు.

Keeravani Son Sri Simha interview with Prabhas:

Sri Simha talks about his comfortable Zone
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs