Advertisement
Google Ads BL

అనిల్ రావిపూడి కోసం ఐటమ్ చేశా: తమన్నా


చాలామంది హీరోయిన్స్ కి చేతిలో సినిమాలు లేకపోతే ఐటెం సాంగ్స్ చెయ్యడానికి రెడీ అవుతారనేది పాత ముచ్చటే. కానీ కొంతమంది ఫామ్ లో ఉన్నప్పుడు కూడా స్పెషల్ సాంగ్స్ లో కనబడతారు. కాజల్ అగర్వాల్, శృతి హాసన్ లాంటోళ్ళు సినిమాలతో టాప్ పొజిషన్ లో ఉన్నప్పటికీ.. హీరోల మీదున్న ఇంట్రెస్ట్ తో వారి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే బాహుబలి తర్వాత అవకాశాలు తగ్గుమొహం పట్టిన తమన్నా ఖాళీగా ఉండి సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఐటెం సాంగ్ చేసిందని ఎవరో కామెంట్ చేశారట. దానికి తమన్నా కూడా ఘాటైన రిప్లై ఇచ్చింది.

Advertisement
CJ Advs

గత ఏడాది సైరా, ఎఫ్ 2 లాంటి బిగ్ ప్రాజెక్టులతో అదరగొట్టిన తమన్నా చేతిలో బోలెడన్ని ఆఫర్స్ ఉన్నాయని చెప్పడమే కాదు.. తనకి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఐటమ్ సాంగ్ చెయ్యాలి అని అడిగితే కాదనలేకపోయా అని.. అంతే కానీ ఖాళీగా ఉండి మహేష్ కోసం సరిలేరు లో ఐటెం సాంగ్ చెయ్యలేదు నేను ప్రస్తుతం బోలెడన్ని సినిమాల్తో ఫుల్ బిజీ అని చెబుతుంది. ఏడాదిలో 365 రోజులు పని చేస్తూనే ఉంటానని, కాల్షీట్స్ లో ఖాళీ దొరికినప్పుడల్లా ఇతర భాషల సినిమాలు చేస్తున్నా అంటూ కాస్త గట్టిగానే చెప్పుకొచ్చింది మిల్కీ బ్యూటీ తమన్నా.

Tamanna Talks About Sarileru Neekevvaru Item Song:

Tamanna Clarity on to do Item Song in Sarileru Neekevvaru
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs