జనవరి 3న గ్రాండ్‌గా విడుదలవుతున్న కె. సి బొకాడియా ‘నమస్తే నేస్తమా’!!
యానిమల్స్ మెయిన్ క్యారెక్టర్ లో రూపొందిన చిత్రాలన్నిసూపర్ హిట్స్ సాధించాయి. ఒక డాగ్ ప్రధాన పాత్రలో జాకీ ష్రాఫ్ హీరోగా కె. సి బొకాడియా అందించిన ‘తేరి మెహెర్బానియా’ గోల్డెన్ జూబ్లీ హిట్ అయింది. ఆ చిత్రం ఇన్స్పిరేషన్ తో ‘తేరి మెహెర్బానియా’ పార్ట్ 2గా కె. సి బొకాడియా దర్శక నిర్మాతగా రూపొందిన ‘నమస్తే నేస్తమా’ జనవరి 3న గ్రాండ్ గా విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర విశేషాలని దర్శక నిర్మాత కె. సి బొకాడియా తెలియజేస్తూ..
మా నాన్నగారు బి.ఎం. బొకాడియా పేరుమీద ‘బి.ఎం.బి’ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి బాలీవుడ్ టాప్ డైరెక్టర్స్, స్టార్ హీరో హీరోయిన్స్ అందరితో సినిమాలు నిర్మించాను. ‘నమస్తే నేస్తమా’ విషయానికి వస్తే.. రెండు కుక్క పిల్లలు చిన్నప్పుడే విడిపోయి ఒకటి పోలీసు దగ్గర, మరోటి దొంగ దగ్గర పెరుగుతాయి. శ్రీరామ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేశారు. అతను హత్యకు గురవుతాడు. ఈ రెండు కుక్కపిల్లలు కలిసి బాస్‌ని చంపిన నలుగురి మీద ఎలా పగ తీర్చుకున్నాయి? ఆ క్రమంలో ఎలాంటి సాహసాలు చేశాయి? చివరికి రెండు కుక్కపిల్లలు ఎలా కలుసుకున్నాయి అనేది కథ. బ్రహ్మానందం పోలీస్ డాగ్స్ కి ట్రైనింగ్ ఇచ్చే అధికారిగా కనిపిస్తారు. నాజర్, షాయాజీ షిండే, తాగుబోతు రమేష్, చమక్ చంద్ర మంచి పాత్రలలో కనిపిస్తారు. ఈ సినిమాలో రెండు కుక్కలు అద్భుతంగా పెర్ఫామ్ చేశాయి. రెండు కుక్కలతో షూటింగ్ చేయడం చాలా కష్టం. అయినా దాదాపు 100 రోజులు షూటింగ్ చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది. బాలీవుడ్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ బప్పి లహరి రెండు పాటలు కంపోజ్ చేశారు. తప్పకుండా మిమ్మల్ని అలరిస్తాయి. అలాగే న్యూ టాలెంట్ చరణ్ అర్జున్ మరో రెండు పాటలకి సంగీతం చేశారు అవి కూడా చాలా బాగా వచ్చాయి. నాకు చాలా ఇష్టమైన ‘తేరి మెహర్భానియా’ ఇన్స్పిరేషన్‌తో తీసిన ఈ మూవీ జనవరి 3న విడుదలవుతుంది. తప్పకుండా మీరందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను.
శ్రీరామ్ (గెస్ట్ అప్పీరియన్స్), ఈషానియ మహేశ్వరి, నాజర్, బ్రహ్మానందం, షాయాజీ షిండే, తాగుబోతు రమేష్, చమక్ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: అజ్మల్‌ఖాన్, సంగీతం: బప్పిలహరి, చరణ్ అర్జున్, ఎడిటర్: బి. లెనిన్, ఫైట్స్: బి.జె శ్రీధర్, సమర్పణ: లలిత్ మోడీ, గౌతమ్‌చంద్ రాథోర్, కో-ప్రొడ్యూసర్: ఎస్.ఆర్ చాప్లాట్, నిర్మాత: బి.ఎం.బి మ్యూజిక్ అండ్ మాగ్నెటిక్స్ లిమిటెడ్, రచన- దర్శకత్వం: కె.సి. బొకాడియా.