ఇస్మార్ట్ హిట్ తో నక్క తోక తొక్కిన పూరిజగన్నాధ్ ఛార్మితో కలిసి విజయ్ దేవరకొండని పట్టి.. ఫైటర్ టైటిల్ తో రేపో మాపో సినిమాని పట్టాలెక్కించబోతున్నాడు. ఇస్మార్ట్ హిట్ తో విజయ్ దేవరకొండ లాంటి క్రేజీ స్టార్ తగలడమే కాదు.. పూరి జగన్నాధ్ కి విజయ్ దేవరకొండ వలన పాన్ ఇండియా మూవీ తీసే ఛాన్స్ దక్కింది. బాలీవుడ్ టార్గెట్ గా తెరకెక్కుతున్న ఫైటర్ కోసం ఇప్పటికే హాట్ హీరోయిన్ ఛార్మి, పూరి జగన్నాధ్ లు అన్ని పనులను ముగించారని టాక్ ఉంది. ఇక బాలీవుడ్ కరణ్ జోహార్ హ్యాండ్ కూడా ఫైటర్ కి తోడవడంతో పూరి అండ్ ఛార్మీలు బిందాస్ గా ఫైటర్ పాన్ ఇండియా స్క్రిప్ట్ ని లాక్ చేసారు. ఇప్పటికే ఛార్మి న్యూ ఇయర్ వేడుకల కోసం చెక్కేస్తుంటే.. పూరి మాత్రం ఫైటర్ సినిమా కోసం ముంబైలో మకాం పెట్టే ఏర్పాట్లను మొదలెట్టాడంటున్నారు.
బాక్సింగ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనున్న ఫైటర్ కోసం పూరితో పాటుగా ఛార్మి కూడా ముంబై కే షిఫ్ట్ అవబోతుందట. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ముంబై వేదికగా పని చేస్తేనే సినిమా వర్కౌట్ అవుతుంది అని కరణ్ జోహార్ సలహా మేరకు పూరి మకాం ముంబైకి మారబోతుందట. మరోపక్క ఫైటర్ సినిమా షూటింగ్ కూడా ముంబై పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువ శాతం ఉండబోతుందట. ఇప్పటికే కరణ్ జోహార్ టీంతో పాటుగా పూరి కూడా ఫైటర్ సినిమా కోసం లొకేషన్స్ సెర్చింగ్ లో ఉన్నారని... ముంబైలోని జుహు, తాజ్ హోటల్ లాంటి ఐకానిక్ ఏరియాల్లో ఫైటర్ షూట్ చేస్తే బావుంటుందని భావిస్తున్నారట. మరి ఈ సినిమాని హిందీలో కరణ్ జోహార్ నిర్మించడం, తెలుగు, తమిళంలో విజయ్ క్రేజ్ తో ఫైటర్ కి భారీ హైప్ రావడం మాత్రం పక్కా.