ప్రస్తుతం ఈటివిలో జబర్దస్త్ ప్రోగ్రాంని రోజా సింగిల్ గా హ్యాండిల్ చేస్తుంది. నాగబాబు ఎగ్జిట్ తో రోజా మీద భారం పడింది. జబర్దస్త్ నే కాదు.. ఇప్పుడు పండగ స్పెషల్ ప్రోగ్రాంని కూడా రోజా సింగిల్ హ్యాండ్ తోనే నడిపించేసింది. ప్రతి ఒక్క పండగకి ఈటీవీ కమెడియన్స్, సింగర్స్, డాన్స్ మాస్టర్స్, హాట్ యాంకర్స్ తో జబర్దస్త్ పెద్దలు రోజా, నాగబాబులు రెండు వర్గాలు చీలిపోయి హడావిడి చేస్తూ.. ఏదో ఒక ప్రోగ్రాంతో ప్రేక్షకులను కట్టిపడేసినట్లుగా ఈసారి కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ రాబోతున్న న్యూ ఇయర్ రోజున అంటే రేపు ఈటీవీలో ఎప్పటిలాగే ఓ స్పెషల్ ప్రోగ్రాం ప్రసారం కాబోతుంది. ఆడవారి పార్టీలకు అర్ధాలే వేరులే అనే స్పెషల్ ప్రోగ్రాంలో నాగబాబు లేకుండానే రోజా ఒక్కటే సింగిల్ హ్యాండ్ తో షోని రక్తి కట్టించింది. ఎప్పటిలాగే హైపర్ ఆది, హాట్ యాంకర్ వర్షిణి యాంకరింగ్ చెయ్యగా.. సుధీర్, శ్రీను, రామ్ ప్రసాద్ లాంటి కమెడియన్స్ స్కిట్స్ చేస్తూ అలరించారనేది తాజాగా బయటికొచ్చిన ఆడవారి పార్టీలకు అర్ధాలే వేరులే ప్రోమోస్ చూస్తే తెలుస్తుంది.
ఇంకా సుడిగాలి సుధీర్ కిర్రాక్ డాన్స్, హాట్ యాంకర్స్ వర్షిణి, విష్ణు ప్రియల హాట్ డాన్స్ పెరఫార్మెన్స్, సింగర్స్ మత్తెక్కించే టాప్ సాంగ్స్ ఆలపించడం, జానీ మాస్టర్ స్పెషల్ డాన్స్.. ఇలా చాలానే ఉన్నాయి. అంతేకాకుండా టివి9 నుండి బయటికొచ్చి బిగ్ బాస్ సీజన్ 3 ద్వారా కాస్తో కూస్తో పాపులర్ అయిన జాఫర్ తనదైన శైలిలో ఆది, రోజాలతో ఆడుకున్న తీరు అన్ని ఆడవారి పార్టీలకు అర్ధాలే వేరు ప్రోమో కట్ లో ఉండడం చూస్తే... ఆ షో కంపల్సరిగా చూడాలనిపించేలా ఉంది. ఇక రోజా బతుకు జట్కా బండి ప్రోగ్రాంని గెటప్ శీను, సుడిగాలి సుధీర్, ఆటో రామ్ ప్రసాద్ లు రోజాతో కలిసి చేసి స్పూఫ్ అబ్బా అదిరిందనే చెప్పాలి. మరి ఎప్పుడూ నాగబాబుతో కళకళలాడే ఈ స్పెషల్ ప్రోగ్రాం ఈసారి నాగబాబు లేకపోయినా.. ఎంత మాత్రం కిక్కు తగ్గలేదని ప్రోమో చూస్తుంటేనే తెలిసిపోతుంది. మరి ఆడవారి పార్టీలకు అర్ధాలే వేరు ప్రోమోనే ఇంత కిరాక్ పుట్టిస్తుంటే... అసలు ప్రోగ్రాం ఎంత మత్తెక్కిస్తుందో.