Advertisement
Google Ads BL

ఎస్.. అనుష్క కోసం డార్లింగ్ వస్తున్నాడు!


‘అరుంధతి’, ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’, ‘సైజ్ జీరో’, ‘భాగమతి’ లాంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల తర్వాత స్వీటీ అనుష్క నటిస్తున్న చిత్రం ‘నిశ్శబ్దం’. ఈ చిత్రాన్ని హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తుండగా.. అంజలి, షాలినీ పాండే, అవసరాల శ్రీనివాస్‌తో పాటు మాధవన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే.. ఈ సినిమా సంక్రాంతికి చాలా సినిమాలు ఉండటంతో నెలాఖరును అనగా జనవరి-31న రిలీజ్ చేయాలని చిత్రబృందం యోచిస్తోంది.

Advertisement
CJ Advs

అయితే.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో అతిథిగా ఎవర్ని పిలుద్దామా..? అని ఆలోచించగా.. యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ అయితే బాగుంటుందని ఫైనల్ అయ్యారట. అయితే దర్శకనిర్మాతలు డార్లింగ్‌ను సంప్రదించకుండా స్వీటీతో చెప్పడంతో.. ఆమె ప్రభాస్‌ను ఒప్పించిందని టాక్ నడుస్తోంది. సో.. మొత్తానికి చూస్తే స్వీటీ సినిమా ప్రమోషన్‌కు డార్లింగ్ వస్తున్నాడన్న మాట.

వాస్తవానికి.. ప్రభాస్ పుట్టిన రోజు మొదలుకుని సినిమా సంబంధించిన ఏ చిన్న పోస్టర్ వచ్చినా ఈ యోగా బ్యూటీ సోషల్ మీడియాలో విష్ చేయడం.. గట్టిగానే ప్రచారం కల్పిస్తుంది. అంతేకాదు దర్శకధీరుడు రాజమౌళి సినిమాలను ప్రమోట్ చేస్తుంటుంది. అయితే స్వీటీ ‘నిశ్శబ్దం’ మూవీ విషయంలో మాత్రం ప్రభాస్‌గానీ.. జక్కన్న గానీ ఇంతవరకూ రియాక్ట్ అవ్వలేదు. సాహో సినిమాలో డార్లింగ్ బిజిబిజీగా ఉండటంతో పెద్దగా పట్టించుకోలేదు.. అందుకే ఆ లోటును అతిథిగా వచ్చి తీర్చాలని అనుకుంటున్నారట. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడాల్సిందే 

Young Rebal star Prabhas Coming For Sweety Anushka!!:

Young Rebal star Prabhas Coming For Sweety Anushka!!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs