Advertisement
Google Ads BL

ఆర్జీవీ నన్ను చీట్ చేశారు..: శ్రీరెడ్డి


టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ ‘అంతా నా ఇష్టం.. నేను ఆడిందే ఆట.. పాడిందే పాట.. తీసిందే సినిమా’ అంటూ ముందుకెళ్తుంటాడు. ప్రస్తుతం ఆయన సినిమాలేమీ లేకున్నప్పటికీ అటు సోషల్ మీడియాలో.. ఇటు మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు. ఇందుకు కారణం తన శిష్యుడు అగస్త్య మంజు తెరకెక్కించిన ‘బ్యూటీఫుల్’ సినిమానే. ఇటీవలే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. హీరోయిన్ నైనా గంగూలితో కలిసి ఆగ్రహంతో కూడిన సంతోషంతో డ్యాన్స్ చేయడం.. ఆ తర్వాత మరోసారి ‘వోడ్కా విత్‌ వర్మ పేరిట..’ బ్యూటిఫుల్‌ టీమ్‌ ప్రీ న్యూ ఇయర్‌ ప్రైవేటు పార్టీ నిర్వహించి సందడి చేయడం.. ఈ క్రమంలో పూటుగా తాగిన ఆర్జీవీ.. డ్యాన్స్ చేసి చేసి అలిసిపోయి నైనా గంగూలి కాళ్లపై పడ్డాడు. అయితే.. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆర్జీవీ తన కాళ్లమీద పడటంతో ఏం చేయాలో దిక్కుతోచక షాక్‌కు గురైంది. సార్.. సార్ అంటూ ఆమె కింద కూర్చుండిపోయింది. ఈ సందర్భంగా ఆ బ్యూటీ ఒకింత భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టినంత పని చేసింది.

Advertisement
CJ Advs

అయితే ఆర్జీవీ చేసిన ఈ పనికి చిత్ర విచిత్రాలుగా కామెంట్స్ వస్తున్నాయ్. అవన్నీ ఒక లెక్క.. వివాదాస్పద నటి శ్రీరెడ్డి కామెంట్స్ ఓ లెక్క. ఈ వ్యవహారంపై తనదైన శైలిలో హాట్ స్పందించింది. ‘వర్మ నన్ను చీట్ చేశారు.. నన్ను దేవత అని పొగుడుతూ.. నా కాళ్లు పట్టుకుంటాన్నారు.. ఇప్పుడేమో ఆ హీరోయిన్ కాళ్లు పట్టుకున్నారు.. నేను హర్ట్ అయ్యాను’ అని తన ఫేస్ బుక్‌లో శ్రీరెడ్డి రాసుకొచ్చింది. ఇందుకు అటు ఆర్జీవీ అభిమానులు.. ఇటు శ్రీరెడ్డి ఫాలోవర్స్ పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. అయ్యో పిచ్చి శ్రీరెడ్డి.. ఆర్జీవీ ఎప్పుడూ మాట మీద నిలబడరు.. కేవలం కాళ్ల మీద మాత్రమే నిలబడతారంటూ సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా.. శ్రీరెడ్డి-ఆర్జీవీ మధ్య మంచి సన్నిహిత సంబంధాలున్నాయ్.. అంతేకాదండోయ్ అప్పట్లో ఆర్జీవీ సెక్సీ ఆఫరిచ్చి డేటింగ్‌ చేయాలని ఉందని మనసులో మాటను బయటపెట్టిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. శ్రీ తాజా కామెంట్స్‌పై వర్మ ఎలా రియాక్ట్ అవుతారో మరి.

RGV Cheats Me.. Said Controversy Queen Sree Reddy:

RGV Cheats Me.. Said Controversy Queen Sree Reddy  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs