Advertisement
Google Ads BL

‘సరిలేరు..’ కి చిరు చాలడా?


భరత్ అనే నేను సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ స్పెషల్ గెస్ట్ గా మహేష్ కోసం హాజరయ్యాడు. ఈసారి సరిలేరు నీకెవ్వరు  సినిమా ఈవెంట్ కి మెగాస్టార్ చిరుని తీసుకొస్తున్నాడు మహేష్ బాబు. చిరు ఆశీస్సులతో మెగా ఫ్యాన్స్ ని ప్రసన్నం చేసుకోవడం మహేష్ ప్లాన్ లో భాగం. ఇక అల వైకుంఠపురములో పోటీని తట్టుకోవడం ఒక ఎత్తు.. ప్రమోషన్స్ లో కొత్తదనం ఒక ఎత్తు అన్నట్టుగా సరిలేరు టీం సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రమోషన్స్ ని ప్లాన్ చేసింది. అయితే సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరు వస్తే... కలిసొచ్చిన ఎన్టీఆర్ కోసం మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు కి మరో ఈవెంట్ ప్లాన్ చేశాడంటూ ఓ న్యూస్ ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. విడుదలకు రెండు రోజుల ముందు అంటే జనవరి 9 న సరిలేరు స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేసి ఎన్టీఆర్ ని గెస్ట్ గా పిలవడానికి డిసైడ్ అయ్యారట.

Advertisement
CJ Advs

అయితే ఎన్టీఆర్ RRR షూటింగ్ తో పాటుగా కొన్ని పర్సనల్ కారణాలతో ఎవరికి అందుబాటులోకి రావడం లేదని, అయితే జనవరి 9 న ఎన్టీఆర్ ఇచ్చే టైంని బట్టి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు ఈవెంట్ కి వేదికను టైంని ఫిక్స్ చేసి అధికారిక ప్రకటన ఇవ్వాలని చూస్తున్నారట. అందుకే ఎన్టీఆర్ కోసం మహేష్ వెయిటింగ్ అంటున్నారు. మరి ఎన్టీఆర్ ఇచ్చే టైంని బట్టి సరిలేరు నీకెవ్వరు స్పెషల్ ఈవెంట్ ఉండబోతుందన్నమాట. మరో పక్క ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ కి ఎన్టీఆర్ మాటివ్వలేదు. కొన్ని కారణాలతో చాలా ప్రోగ్రామ్స్ ని ఎన్టీఆర్ క్యాన్సిల్ చేసుకున్నాడని అందుకే కళ్యాణ్ రామ్ కూడా ఎంత మంచివాడవురా ఈవెంట్ కోసం ఎన్టీఆర్ ని తీసుకురాకపోవచ్చనే న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో నడుస్తుంది. మరి అన్నకి మాటివ్వని ఎన్టీఆర్, మహేష్ కి మాటిస్తాడా.. అనేది ప్రస్తుతం డౌట్.

Gossip: Sarileru Neekevvaru Special Event for Jr NTR:

Jr NTR Cheif Guest for Sarileru Neekevvaru Special Event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs